మరుగుతున్న నది..!

అగ్ని వర్షం కథలు విన్నాం. కప్పలు, చేపల వర్షాన్ని ప్రత్యక్షంగా చూశాం. వేడి నీటి ఊటల గురించి టీవీల్లో చూశాం. కానీ ఏకంగా కిలో మీటర్ల పొడవునా ప్రవహించే ఓ నది.. నిత్యం మరుగుతుందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. అమెజాన్‌ అడవుల్లో ఉండే ఈ నది క్షణాల్లో ప్రాణాలు తీస్తుందని వినికిడి.

- ప్రపంచంలో ప్రత్యేకతలు కలిగిన అనేక నదులున్నాయి. ఒక్కొక్క నది ఒక్కొక్కరకమైన విశిష్టతను కలిగి ఉంది. అయితే వీటిని తలదన్నేలా ఒక నది ఉంది. ఈ నదిలోని నీరు 24 గంటలూ మరుగుతూనే ఉంటుంది. అందుకే ఈ నదికి 'బాయిలింగ్‌ రివర్‌' అని పేరు. ఇది దక్షిణ అమెరికాలోని అమెజాన్‌ సముద్ర తీరంలో ఉంది. 
- అడవి మధ్యన ఆరున్నర కి.మీ.ల మేర ఉధత వేగంతో ప్రవహించే ఈ నదిలోని నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిత్యం మరిగిపోతుంటుంది. ఈ నీటితో వంట అత్యంత సులభంగా చేయవచ్చట. ఈ నదిలో ఏ జంతువు పడినా అది బతకడం కష్టం.
- చలివాతావరణంలోనూ ఈ నదిలోని నీరు వేడిగా ఉంటుందట. ఈ నీరు ఇంత వేడిగా ఉండటానికి కారణం... నది అడుగుమట్టంలో అగ్నిపర్వతం ఉండివుండచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
- అగ్నిపర్వత ప్రాంతంలో ఉష్ణనీటి ఊటలు, మడుగులు, కొలనులు, స్ప్రింగ్స్‌ ఉండటం సాధారణం కానీ ఇలా ఏకంగా మరుగుతున్న నదే ఉందంటే అదో నమ్మశక్యం కాని విషయమని చాలామంది కొట్టిపారేశారు. కారణం అగ్నిపర్వత ప్రాంతానికి వారు చెబుతున్న పెరూలోని అమెజాన్‌ అడవులు 700 కి.మీ. దూరంలో ఉండటమే.
- ఈ నదిని 2011లో కనుగొన్నారు. పెరూలోనే పుట్టిపెరిగిన ఆండ్రెస్‌ రూజో అనే ఖగోళ శాస్త్రవేత్త చిన్నతనం నుంచే అక్కడి మరిగే నది గురించి విని, ఆ నది నిజంగా వుంటుందా అని ఆలోచించేవారు. ఈ నది గురించి అక్కడి స్థానికులు కథలు కథలుగా చెప్పుకునేవారట. దీని గురించి తెలుసుకోవాలని పట్టుబట్టి రూజో అరణ్యంలోకి వెళ్లి చూడగా అక్కడ నిజంగానే మరిగే నదిని చూసి విస్తుపోయారట.
- ఆయన కథనం ప్రకారం ఆ నదిలోని నీరు సుమారు 86 డిగ్రీలు వుందనీ, అది కూడా చిన్న వేడి నీటి గుంటలా కాకుండా 25 మీటర్ల విస్తీర్ణం, 6 మీటర్ల లోతున పెద్ద నది ప్రవహిస్తోందట. అయితే భారీ వర్షాలు పడ్డపుడు మాత్రం ఈ నదిలోని నీరు చల్లని నీటితో కలిసినప్పుడు గోరువెచ్చగా అవుతుందట, అప్పుడు అక్కడ ఈత కొట్టే వారి సంఖ్య ఎక్కువగా వుంటుందట. అయితే సాధారణ రోజుల్లో మాత్రం వన్యప్రాణులు వేడికి ఆ దరిదాపుల్లోకి కూడా రావు.
- అంతేకాదు ఈ నది నీటి ఆవిరి వల్ల అక్కడ ఓ ప్రత్యేకమైన జీవ వ్యవస్థ రూపుదిద్దుకుంది. 
- నాకొ వక్షాలతో పాటు ఎన్నో ఔషధాల వక్షజాలం అక్కడ పెరిగింది. అంత వేడి నీటిలో కూడా యథేచ్ఛగా పెరుగుతున్న కొన్ని సూక్ష్మజీవజాలాలు, నీటి ఆవిరి అధికంగా ఉన్నా మనగలుగుతున్న చెట్లు, కొన్ని చేపలు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచే విషయాలు.

©2019 APWebNews.com. All Rights Reserved.