మనకి సమాంతరమైన విశ్వం ఇంకొకటి వుందా?

మనకి సమాంతరమైన విశ్వం ఇంకొకటి వుందా? ఈ ఆలోచన మనకి గుగుర్పాటు కలిగిస్తుంది కానీ, ఇది నిజం కావచ్చంటున్నారు డాక్టర్ బ్రైన్ గ్రీన్. ’ది హిడెన్ రియాలటి: పారలేల్ యూనివర్స్, డీప్ లాస్ ఆఫ్ కాస్మోస్”  అనే పుస్తకం రాసిన ఆయన ఇచ్చిన  ఒక టివి ఇంటర్వూలో  నిరంతరం  చలనం  లక్షణంగా వున్న  ఈ ఖగోళ విశ్వంలో,  మన  ప్రపంచం  పక్కనే ఇంకొక ప్రపంచం  వుండవచ్చని చెప్పారు.

 ఖగోంతరాళాలో  ఎన్నో విశ్వాలలో మన విశ్వం ఒకటనీ, వీటిలో కనీసం ఒకటి  మన ప్రపంచానికి  మిల్లీమీటరు దూరంలో  వున్నా వుండవచ్చని గ్రీన్ లాగా ఎంతోమంది ఖగోళ శాస్త్రజ్ఞులు  అభిప్రాయపడ్తున్నారు. పక్కనే వున్నా మనకి ఈ విశ్వం కనిపించదు. ఎందుకంటే ఇది మన కళ్ళకి కనిపించే నాలుగు డైమెన్షన్ కు  అతీతంగా వుంది. మస్సాచూట్స్  యూనివర్సిటీ శాస్త్రవేత్త మాక్స్ తెగ్మార్క్ “ఖగొంతరాళా లలో  ఎన్నో విశ్వ ప్రపంచాలున్నవనే  సిద్ధాంతం ఆధునిక భౌతిక శాస్త్రంలో వేళ్ళూనుకొంది. అతి త్వరలో   అది నిజమో లేక వుత్త కల్పనో కనుగొనగలుగుతామ”ని  చెప్పారు.

ఇది వూహ మాత్రం  కాదు, నిజం.

ప్రోటాన్ కొలిజన్ ఉపయోగించి  పార్టికిల్ భౌతిక శాస్త్రం, హై ఎనర్జీ భౌతిక శాస్త్రాలో సిద్ధాంతాలను పరీక్షించే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రిసెర్చ్ (CERN)  శాస్త్రవేత్తలు , ఖగోళం లో నూతన భౌతిక  శాస్త్ర విషయాలు  కనుగొంటున్నారు . వాటి  సాయంతో విశ్వం లో మనకి తెలియని ఎన్నో విషయాలని తెలుసుకోవచ్చని చెప్తున్నారు.  ఈ అనంత విశ్వంలో  దాగివున్న డార్క్ ఎనర్జీ గురించీ, కొంతమంది ఆధునిక సిద్ధాంత వాదులు బలపరుస్తున్న మరొక విశ్వ ప్రపంచం గురించీ  అర్ధం చేసుకోవడానికి ఈ కొత్త సిద్ధాంతం దోహద పడుతుందని అంటున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 2.2 మిలియన్ లైట్ ఇయర్ల దూరంలో  వున్న ఆండ్రోమెడా గేలక్సీ   మిల్కీ వే వైపు గంటకి 2,00,000 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తోందని ఈ శాస్త్రవేత్తలు  గమనించారు. మనకి కనిపించని ఇంకో విశ్వ గురుత్వాకర్షణ శక్తి  వల్ల ఇలా  రెండు గేలక్సీలూ దగ్గిరవుతున్నట్లు ఊహించవచ్చు.

WMAP స్పేస్ టెలిస్కోప్ దగ్గిర వున్న శాస్త్రవేత్తలు ప్రప్రంచంలో  మిల్కీ వే కంటే 10,000 రెట్లు ఎక్కువ బలమైన శక్తి వున్నట్టు కనుగొన్నారు. అందువల్ల మన విశ్వానికి సమాంతరమైన విశ్వం వుండడం నిజం కావచ్చంటున్నారు.

సమాంతర విశ్వాన్ని అన్వేషించే ప్రయత్నంలో నాసా ఆల్ఫా మేగ్నటిక్ స్పెక్ట్రో మీటర్ -2 ని ఐఎస్ ఎస్ లో స్థాపించింది.  విరుద్ద పదార్ధాల(యాంటీ మాటర్)తో కూడిన సమాంతర విశ్వాలు కూడా వుండే అవకాశాన్ని ఈ సమాచారం నుంచి విశ్లేషించ వచ్చు. ఈ అంతరిక్ష రహస్యాన్ని శోధించడానికి ప్రపంచమంతా ముందుకి వచ్చింది. ఎన్నో యూరోపియన్ యునియన్ దేశాలతో పాటు  తైవాన్, చైనా, రష్యా, అమెరికా ఈ ప్రాజెక్టుకి సహాయపడుతున్నాయి.

ఈ ఇంకొక విశ్వానికి మనం వెళ్ళి చూసి రావచ్చా? ఇటివలే ఇచ్చిన ఇంటర్వూ లో అంతరిక్ష శాస్త్రజ్నుడైన క్లిఫ్ఫార్డ్ జాన్సన్ ఇది కధలా చెప్పుకుని చర్చించుకోవచ్చు కాని, దీన్ని గురించి  శాస్త్రవేత్తలు ఇంకా చాలా పరిశోధించాల్సి వుందన్నారు. మన శరీర నిర్మాణంలో  వుండే గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంతత్వం మనని ఈ విశ్వానికి కట్టిపడేసి వుంచుతాయని చెప్తున్నారు.

అవి మనని మన  విశ్వంలోని  నాలుగు డైమెన్షన్ ( పైన కింద, ముందు వెనక లకు , కుడి ఎడమలు, కాలం)   నించి బయటకి రానివ్వవు. మన పక్కనే ఇంకొక విశ్వం వుండివుండచ్చు. కానీ దాన్ని అర్ధం చేస్కోవాలంటే వాటికున్న డైమెన్షలను   మనం అర్ధం చేస్కోవాలి.  ఈ కొత్త డైమెన్షలను నూతన పార్శ్వ ప్రమాణాలుగా గుర్తించాలి.

©2019 APWebNews.com. All Rights Reserved.