కరుణానిధి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..?

 

దేశరాజకీయాలని ప్రబావితమ చేయగల సమర్థులు డీఎంకే చీఫ్ తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి(94).  తమిళనాడు రాజకీయాలకు సరికొత్త అర్ధాన్ని చెప్పిన వారిలో ఒకరు. దేశ రాజకీయాలను కూడా ఆయన ప్రభావితం చేయగల సమర్థులు. దేశవ్యాప్తంగా చూసుకుంటే అత్యంత సీనియర్ నాయకుల్లో ఆయనే మొదటి వారు. తమిళనాడు రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన కరుణానిధి శకం ముగిసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నఆయన ఆగష్టు 7, 2018న తుది శ్వాస విడిచారు.ఇకపోతే కరుణానిధి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.

బ్రిటిష్ ఇండియా పాలనలో మద్రాస్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 1924 జూన్ 3న తిరుకువాలైలో కరుణానిధి  జన్మించారు. అయితే కుటుంబ పరంగా చూసుకుంటే కరుణానిధి తెలుగు రాష్ట్రానికి చెందినవారే అవుతారు. ఎందుకంటే వారి తండ్రి తాతల పుట్టినిల్లు తెలుగునేల కాబట్టి. ప్రకాశం జిల్లాలో వారి పూర్వికులు ఉండేవారు. కరుణానిధి అసలుపేరు దక్షిణామూర్తి అని ఒక రూమర్ ఉంది. అది ఎంతవరకు నిజం అనేది ఇంతవరకు ఆయన కుటుంబసభ్యులు నిర్దారించలేదు. ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్న కరుణానిధి 14 ఏళ్ల నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అభ్యుదయ బావాలున్నావ్యక్తిగాఎంతోగుర్తింపు తెచ్చుకున్నారు.1969లో డీఎంకే అధినేత అన్నాదురై మరణించిన తరువాత పార్టీ పగ్గాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్న ఆయన తమిళనాడు రాష్ట్రానికి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.కరుణానిధి మొదట సినిమాలకు ఒక రచయితగా పనిచేసి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు .ఎమ్.జి.ఆర్ శివాజీ గణేశన్ వంటి హీరోల ఎదుగుదలలో ఆయన పాత్ర చాలానే ఉంది. మొదట రాజకుమారి అనే సినిమాకు రచయితగా పనిచేసి 20 ఏళ్ల వయసులోనే బిజీ అయిపోయారు. మొదట్లో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని సినిమాలు విడుదల కావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. హిందూ మతానికి రచన వ్యతిరేఖంగా ఉందనే వివాదాలు చెలరేగాయి. ముఖ్యంగా పరాశక్తి అనే సినిమాకు ఎక్కువ ఇబ్బందులు వచ్చినప్పటికీ విడుదల తరువాత శివాజీగణేశన్ కెరీర్ కి అదే సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. కరుణానిధి ఎమ్.ఎల్.ఏ గా 13సార్లు ఎన్నికయ్యి అప్పట్లో రికార్డు సృష్టించారు. 2006 లో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ఆయన తమిళనాడుకు ఎన్నికైన ఓల్డెస్ట్ ముఖ్యమంత్రిగా నిలిచారు.

 

©2019 APWebNews.com. All Rights Reserved.