అతి పురాతన రెస్టారెంట్‌ ...!

ఆ రెస్టారెంట్‌కు దేశదేశాల నుంచి అతిథులు వస్తుంటారు... అందులో ప్రత్యేకమైన వంటకాలేమీ చేయరు.. కానీ గిన్నీస్‌ రికార్డు కొట్టింది..ఇంతకీ ఆ రెస్టారెంట్‌ ఎక్కడుంది. దాని విశేషాలెంటో తెలుసుకుందామా!

 ఒక కంపెనీ స్థాపించి వందేళ్లయిందంటే మహా గొప్పగా చెబుతుంటారు. మరి ఒక రెస్టారెంటు పెట్టి ఏకంగా 291 ఏండ్లు దాటింది. ఇది స్పెయిన్‌లోని మాడ్రిడ్‌ నగరంలో ఉంది. పేరు సోబ్రినో డి బొటిన్‌. ప్రపంచంలోనే ఎక్కువ కాలం నుంచి నడుస్తున్న అతి పురాతన రెస్టారెంటు (ఆహారశాల)గా దీనికి ప్రపంచ రికార్డు వచ్చింది. జీన్‌ బొటిన్‌ అనే వంటమనిషి ఆయన భార్యతో కలిసి 1725లో ఈ రెస్టారెంటును ప్రారంభించాడు. అలా అప్పటి నుంచీ ఇది నేటి వరకు నడుస్తూనే ఉంది. ఇక్కడ సంప్రదాయమైన వంటకాలు ఎంతో పసందుగా, తాజాగా వండిపెడతారు. అందుకే ఇన్నేళ్లయినా ఆదరణ తగ్గలేదు. ఇది శాకాహారులకు మింగుడుపడని రెస్టారెంటేనని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా పంది మాంసం, గొర్రె మాంసాలను రుచికరంగా వండి వడ్డిస్తారు. ఈ రెస్టారెంటుకు గొప్ప చరిత్ర ఉండడంతో ఇదో పర్యటక ఆకర్షణగా మారింది. ఇక్కడికి దేశదేశాలనుంచి ప్రముఖులు, హాలీవుడ్‌ నటులు వస్తుంటారు. అంతేకాదు దీని గురించి ఎన్నో నవలల్లో ప్రస్తావించారు. ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్‌' మ్యాగజైన్‌లో కూడా ఈ రెస్టారెంటు గురించి ఇచ్చారు.

©2019 APWebNews.com. All Rights Reserved.