ప్రపంచంలోనే సూపర్‌ ఫాస్ట్‌ కంప్యూటర్‌

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సూపర్‌ కంప్యూటర్‌ను అమెరికా ఆవిష్క రించింది. దీనికి 'సమిట్‌'గా నామకరణం చేసింది. చైనాకు చెందిన 'సన్‌వే తైహులైట్‌' రికార్డులను దీని సాయంతో బద్దలుకొట్టింది.

సెకనుకు 93,000 ట్రిలియన్ల (ఒక ట్రిలియన్‌ అంటే లక్ష కోట్లు) గణనలు తైహులైట్‌ చేయగలదు. దీనికి రెట్టింపు వేగంతో పనిచేసేలా సమిట్‌ను అమెరికా అభివద్ధి చేసింది. సెకనుకు రెండు లక్షల ట్రిలియన్ల గణనలు చేసేలా దీన్ని తీర్చిదిద్దింది. ఓక్‌రిడ్జ్‌ నేషనల్‌ ల్యాబ్‌లో ఏర్పాటు చేశారు.

- ఓ సాధారణ కంప్యూటర్‌ 30ఏళ్లు కష్టపడిచేసే గణనను సమిట్‌ ఓ గంటలోనే పూర్తిచేయగలదు.
- 4608 సర్వర్లు, 9000 '22-కోర్‌ ఐబీఎం పవర్‌9 ప్రాసెసర్లు'', 27,000 ఎన్‌విడియా టెస్లా వి100 జీపీయూల సాయంతో సమిట్‌ పనిచేస్తుంది. రెండు టెన్నిస్‌ కోర్టులకు      సమానమైన స్థలంలో దీన్ని ఏర్పాటుచేశారు.
- ఈ సూపర్‌ కంప్యూటర్‌ వేడి చల్లారాలంటే నిమిషానికి 4,000 గ్యాలన్ల నీరు అవసరం.
- ఇది నడవాలంటే 8,100 ఇళ్లకు అవసరమయ్యేటంత విద్యుత్‌ కావాల్సిందే.
- కృత్రిమ మేధస్సు ఆపరేషన్లుబీ ఆరోగ్యం, పర్యావరణం, భౌతిక శాస్త్ర విభాగాల్లో పరిశోధనల కోసం దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
- ''సెకనుకు బిలియన్‌ బిలియన్ల (ఒక బిలియన్‌ అంటే వంద కోట్లు) గణనలుచేసే కంప్యూటర్‌ వ్యవస్థ'' కలను అమెరికా సాకారంచేసుకునే దిశగా పడిన మొదటి అడుగుగా సమిట్‌ను అభివర్ణిస్తున్నారు. 2021నాటికి ఈ లక్ష్యం నెరవేసే అవకాశ ముందని నిపుణులు అంచనావేస్తున్నారు.

©2019 APWebNews.com. All Rights Reserved.