భారత్‌లో పాకిస్తానీ టౌన్‌..!

దొక అందమైన టౌన్‌. అక్కడ కోటల దగ్గర నుంచి చిన్న చిన్న గోడల వరకూ అన్నింటి మీదా రంగురంగుల పెయింటిగులు ఉంటాయి. ఆ ప్రదేశంలోని హవేలీ, కోటల సౌందర్యం చూపరులను కట్టిపడేస్తుంది.

‘భజరంగీ భాయిజాన్‌’ సినిమాలో పాకిస్తానీ టౌన్‌గా పరిచయమైన ఆ రాజస్తానీ ఊరు పేరు ‘మాండవా’. ఇది రాజస్తాన్‌లోని ఝున్‌ఝునూ జిల్లాలోని షెకావత్‌ ప్రాంతంలో ఉంది.

అది చిన్న ఊరే అయినా సాంస్కృతికపరంగా ధనిక ప్రదేశం. మాండవాలోని గ్రామీణ వాతావరణం, పురాతన భవనాలు, హవేలీలు బాలీవుడ్‌ని తెగ ఆకర్షిస్తున్నాయి. దాంతో మాండవా బాలీవుడ్‌ సినిమా షూటింగులకు వేదికైంది. షారుఖ్‌ ఖాన్‌ని స్టార్‌గా నిలబెట్టిన ‘పహేలీ’, ‘జబ్‌ వి మెట్‌’ సినిమాలో ఓ పాట, అలాగే అమీర్‌ ఖాన్‌ లేటెస్ట్‌ హిట్‌ సినిమాలోని ఓ పాటను మాండవాలోనే చిత్రీకరించారు. చారిత్రక ప్రదేశాలకు పెట్టింది పేరుగా ఉండే మాండవాలో ‘లవ్‌ ఆజ్‌కల్‌’, ‘సూపర్‌ సె ఊపర్‌’, వంటి సుమారు 8 బాలీవుడ్‌ సినిమాల చిత్రీకరణ జరిగింది.
 
మాండవా ప్రాంతం ఢిల్లీ నుంచి 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. సహజ సిద్ధమైన లొకేషన్లు, తక్కువ నిర్మాణ ఖర్చు, ప్రశాంతమైన వాతావరణం ఉండడం వల్లే అక్కడ షూటింగ్‌ చేయడానికి దర్శకులు ఆసక్తి చూపుతున్నారని ఫిల్మ్‌ వర్కర్‌ ఒకరు చెప్పారు. అక్కడి బంగారు పసుపు వర్ణంలోని పొలాలు, అనేక వంపులుండే రోడ్లు, సల్మాన్‌ ఖాన్‌కి బాగా నచ్చాయట. ‘‘ మాండవా చాలా అందమైన ప్రదేశం. మేము మాండవాలో షూటింగ్‌ చేసేటప్పుడు అర్బాజ్‌ ఖాన్‌ నటించిన ‘ఢిల్లీ కీ డోలీ’ సినిమా చూడాలనుకున్నాం. దాని కోసం గంటంబావు ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ ప్రాంతంలో ఒకే ఒక్క సినిమా హాలు ఉంది.’’ అని సల్మాన్‌ మాండవాలో తన షూటింగ్‌ అనుభవాలను చెప్పారు.
 
అక్కడి వాళ్లు చాలామంది స్టార్‌డమ్‌కి అంత ప్రాధాన్యం ఇవ్వరు. అసలు కొంతమందికైతే బాలీవుడ్‌స్టార్లు కూడా తెలియదట. ఓ సారి అమీర్‌ ఖాన్‌, అతని భార్య కిరణ్‌తో కలిసి ఓ టీ షాపుకి వెళ్తే టీ అమ్ముకునే వ్యక్తి వాళ్లను గుర్తు పట్టలేదు. ఇతర పర్యాటకుల్లాగే వాళ్లను కూడా చూశాడు .ఆ ఊళ్లో సినిమా షూటింగులు చేయడం వల్ల అక్కడి ప్రజలకు కూడా ఉపాధి దొరుకుతోంది. అక్కడ హనుమాన్‌ ప్రసాద్‌ గోయంకా హవేలీ, డబుల్‌ హవేలీ, ఝున్‌ఝున్‌ వాలా హవేలీ, ముమూరియ హవేలీ, లాడియా హవేలీ, వంటివి పలు హవేలీలు కోటలు పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి.
©2019 APWebNews.com. All Rights Reserved.