భ్రమింపజేసే త్రీడీ మ్యూజియం..!

మ్యూజియం అంటే చారిత్రక వస్తువులను భద్రపరిచే ప్రదేశమని అందరికీ తెలుసు. అలా ప్రపంచవ్యాప్తంగా చాలా మ్యూజియాలు ఉన్నాయి. అలాంటి ప్రదేశాల్లో అడుగుపెడితే ఎన్నో పురాతన వస్తువులు ఆప్యాయంగా పలకరిస్తాయి.

కానీ, కొన్ని మ్యూజియాలు విభిన్నరీతిలో ఉంటాయి. ఇలాంటివాటిని చూడ్డానికి పర్యాటక ప్రేమికులు, ఔత్సాహికులు బారులు తీరతారు. అలాంటి ప్రత్యేక మ్యూజియం గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అదే క్రియేటివ్‌ 3డి ఇంటారాక్టివ్‌ మ్యూజియమ్‌. అక్కడ కనిపించేందంతా భ్రమలా ఉంటుంది. ఈ ఒక్క ప్రత్యేకతతోనే ఇది ప్రపంచంలోని అతి అద్భుతమైన మ్యూజియమ్‌గా పేరొందింది. ఈ 3డి ఆర్ట్‌ మ్యూజియమ్‌ పేరు 'ఆర్ట్‌ ఇన్‌ ఐస్లాండ్‌'. ఫిలెఫియాస్‌లోని సబర్బన్‌ క్యూజాన్‌ సిటీలో ఉంది. ఈ మ్యూజియమ్‌లో 50కి పైగా కుఢ్యచిత్రాలు ఉన్నాయి. ఈ ఆర్ట్‌ మనల్ని భ్రమలోకి తీసుకెళుతుంది. సౌత్‌ కొరియన్‌లోని ఈ 'ఆర్ట్‌ ఇన్‌ ఐలాండ్‌' సిఇవో యన్‌ జె యంగ్‌. ఇతనే మనీలాలో 3డి ఆర్ట్‌ మ్యూజియాన్ని నిర్మించారు. ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేసే చిత్రాలకు ఈ మ్యూజియం పెట్టింది పేరు. ఇటీవలి కాలంలో ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరింతమందిని ఆకర్షించేందుకు వినూత్న రీతిలో సరికొత్త త్రీడీ పెయింటింగ్స్‌ అందిస్తున్నారు నిర్వాహకులు.

©2019 APWebNews.com. All Rights Reserved.