వృద్ధ పైలెట్‌ రికార్డ్‌..!

అరవై ఏళ్లు వచ్చేసరికి.. బైకు నడపడం ఆపేస్తారు. అప్పటికి ఆరోగ్యం బాగుంటే కష్టం మీద కారు నడపగలుగుతారు. ఈ ముసలాయనను చూడండి.

ఇప్పుడీయనకు 95 ఏళ్లు. విమానం ఎక్కాడంటే రయ్‌మని దూసుకు వెళతాడు. ప్రపంచంలోనే అతి వృద్ధ పైలెట్‌గా ఏకంగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కేశాడీయన. ఆ పైలెట్‌ పేరు పీటర్‌ వెబర్‌. సెంచరీకి చేరువలో ఉన్న ఈయన ఇదివరకు ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారట. అప్పటి నుంచి విమానాలు నడపడం అలవాటు. రిటైర్డ్‌ అయినా సరే, వయసు ముంచుకొచ్చినా సరే.. విమానాలు నడపడం ఆపడం లేదు. కాలిఫోర్నియాకు చెందిన పీటర్‌గా ఆ రకంగా ఎక్కడలేని గర్తింపు వచ్చింది. విమానయాన రంగంలో అడుగుపెట్టే యువతీయువకులకు సైతం ఆయన స్ఫూర్తిమంతుడు. 2007లో కొలరాడోకు చెందిన 105 ఏళ్ల వృద్ధుడు కోల్‌ కూగెల్‌ విమానం నడిపి ఓల్డెస్ట్‌ పైలెట్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే విమానాన్ని నడిపిన ఏడాదే కూగెల్‌ చనిపోయాడు. ఈ రికార్డును తిరగరాయాలని పూనుకున్నాడు పీటర్‌ వెబర్‌. లైసెన్సు ఉండి.... ఎవరి సాయమూ లేకుండా ఒంటరిగా విమానాన్ని నడిపిన ఓల్డెస్ట్‌ పైలెట్‌గా పీటర్‌ సంచలనం సృష్టించాడు. మార్చి 30న గగన వీధుల్లో రెండుమూడు రౌండ్లు కొట్టొచ్చినట్లు అక్కడి పత్రికలు వెల్లడించాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ పైలెట్‌గా ఇతన్ని గిన్నిస్‌ గుర్తించింది.

©2019 APWebNews.com. All Rights Reserved.