ఎలియన్స్‌ (గ్రహాంతర జీవులు) ఉన్నారా;?

గ్రహాంతర జీవులు ఉన్నారా.. ఉంటే నాగరికతపరంగా వారు మనకన్నా చాలా ముందున్నారా..? అంతరిక్ష పరిశోధకులను చాలా కాలంగా వేధిస్తున్న ప్రశ్నలివి. తాజా పరిశోధన ఈ సందేహాలను తీర్చింది.

సుమారు లక్షకు పైగా నక్షత్ర మండలాలపై బాగా అభివృద్ధి చెందిన గ్రహాంతర జీవనానికి సంబంధించిన ఆనవాళ్లేమీ కనిపించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అందులోని ఓ యాభై నక్షత్ర మండలాలలో గ్రహాంతర జీవనం ఉండేందుకు అవకాశం ఉందని అనుమానాస్పద ఇన్‌ఫ్రారెడ్‌ యాక్టివిటీ తెలియజేస్తోందని పెన్‌ స్టేట్‌ వర్సిటీ పరిశోధకులు వివరించారు. వాస్తవంగా గ్రహాంతర జీవులు ఉండి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంటే... ఆయా గ్రహాలపై రేడియో తరంగాలు లేదా మరే ఇతర తరంగాల ఉనికి తప్పకుండా ఉంటుంది. నాసా వైడ్‌ ఫీల్డ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సర్వే ఎక్స్‌ప్లోరర్‌ (వైస్‌) సాయంతో అలాంటి తరంగాలను గుర్తించేందుకు ప్రయత్నించగా.. లక్ష నక్షత్ర మండలాలపై ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని వర్సిటీ పరిశోధకుడు జాసన్‌ తెలిపారు.

©2019 APWebNews.com. All Rights Reserved.