70 వసంతాలు పూర్తి చేసుకున్న ఎయిరిండియా విమానం...!

ప్రస్తుతం ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయినా ఎయిరిండియాకు చెందిన ఎన్నో విమానాలు చక్కర్లు కొట్టడం చూస్తున్నాం..కానీ మొదటి ఎయిరిండియా విమానం వచ్చి ఎన్ని ఏళ్లు గడించింది..

మొదటిసారిగా ఏ ప్రాంతానికి వెళ్లిందో తెలుసా…?అయితే అది తెలుసుకుందాం పదండి..మొదటి ఎయిరిండియా విమానం వచ్చి సరిగ్గా 70 ఏళ్లు అవుతుంది. 1948 జూన్ లో ముంబయి నుంచి బయలుదేరి లండన్‌ చేరుకుంది. ఈ విమానం ప్రయాణం వల్ల భారత్‌-యూకే మధ్య సత్సంబంధాలకు పునాదులు పడినట్లైంది. జూన్‌ 8న ముంబయిలో టేకాఫ్‌ అయిన విమానం కైరో మీదుగా జెనీవా, అక్కడి నుంచి జూన్‌ 10, 1948న లండన్‌లో ల్యాండ్‌ అయ్యింది.ఇక ఈ విమానంలో మొత్తం 42మంది ప్రయాణికులు ప్రయాణం చేసారు. ఇందులో కొందరు భారత్‌కు చెందిన వారు ఉండడం విశేషం. ఈ 70ఏళ్ల కాలంలో విమాన ప్రయాణాల్లో ఎన్నో మార్పులు రావడం మనం చూసాం.

©2019 APWebNews.com. All Rights Reserved.