అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళ కల్పనా చావ్లా లైఫ్ హిస్టరీ ...!

కల్పనా చావ్లా భారత దేశంలోని హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17 న జన్మించింది. ఆమె పాఠశాలలో చేరినప్పుడు రికార్డుల ప్రకారం అధికార జన్మదినం జూలై 1 1961. తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం.

సునీత, దీప, సంజయ్ ల తర్వాత ఈమె జన్మించారు. ఇంట్లో అందరూ ముద్దుగా "మోంటు" అని పిలుచుకొనే కల్పనా చావ్లా కులీన కుటుంబంలో పుట్టలేదు. తండ్రి బనారసీలాల్ చావ్లా సాధారణ వ్యాపారి కల్పనపై ఆయన ప్రభావం ఎక్కువ. పేదరికం నుంచే ఆయన పైకెదిగారు. పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి ఆయన. చిన్నగా టైర్ల వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన తొలుత ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. అయినా దాన్ని వదలకుండా అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగిపోయారు. అప్పటి వరకూ టైర్ల తయారీకి విదేశీ యంత్రాన్ని ఉపయోగించేవారు. ఆ క్రమంలో ఆయన దేశీయంగానే ఆ యంత్రాన్ని రూపొందించారు. బనారసీలాల్ శ్రమ ఫలించింది. రాష్ట్రపతి నుంచీ అభినందనలు అందుకున్నారు. తర్వాత డబ్బుకోసం బనారసీ కుటుంబం ఇబ్బంది పడింది లేదు. ఆడపిల్లే అయినా జీవితంలో ఏదో సాధించాలన్న తపన కల్పనలో పాదుకోవడానికి తండ్రేకారణం. 

కల్పనా చావ్లా ముందుగా, కర్నాల్ లో ఉన్న టాగోర్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. తోటి పిల్లలంతా కామిక్ పుస్తకాలు చదువుతూ .....బర్బీ బొమ్మల్లా అలంకరించుకునే వయసులో... ఆమె తెల్లవారు జామునే లేచి సైకిల్ పై స్కూలు కెళ్ళేవారు. స్కూల్లో డ్రాయింగ్ క్లాసులో విమానం బొమ్మలు గీయటానికి ఇష్టపడేవారు. ఈమె సోదరుడు సంజయ్ చావ్లా కమర్షియల్ పైలట్ కావాలని కలలు కనేవాడు. తన గదిలో విమానాల బొమ్మలుంచేవాడు. అవి కల్పనలో స్ఫూర్తిని కలిగించాయి. కల్పన తన కలల్ని నిజం చేసుకోవటానికి ఈమె సోదరుడు సంజయ్ ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇద్దరి కలలూ ఒకటే - ఆకాశంలో ఎగరడం. కర్నాల్ లోని టాగోర్ పాఠశాలలో ఈమె ప్రాథమిక విద్య సాగింది.పంజాబ్ ఇంజరీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. 1982 లో ఈమె అమెరికా వెళ్లి అక్కడ టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి "ఏరోస్పేస్ ఇంజనీరింగు" లో మాస్టర్స్ డిగ్రీని 1984లో పొందారు. 1986 లో చావ్లా రెండవ మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీని మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పిహెచ్ .డిని బౌల్డెర్ లో ఉన్న కోలోరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందారు. అందమైన భవిష్యత్ కోసం కలలు కంటూ గాలిలో మేడలు కట్టకుండా జీవిత లక్ష్యాన్ని సాధించుకున్న మహిళ కల్పనా చావ్లా. చదువులో ఎప్పుడూ ముందు ఉండేది. ఈమెను ఎక్స్‌ట్రావెర్ట్ గా ఉపాధ్యాయులు పేర్కొనేవారు. సహజంగా ఒక వ్యక్తి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయసులో కెరియర్ ను ప్రారంభించినా, అప్పటి నుంచి ఓ 15 ఏళ్ళు కష్టపడితే గాని పేరు రాదు. కానీ కల్పన పిన్నవయసులోనే గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఈమె నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసినపుడు ఈమెతో 2 వేల మంది పోటీ పడ్డారు. అయితే ఈమె మాత్రమే నాసా శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు సంప్రదాయవాదులే అయినా కొత్తను ఎప్పుడూ ఆహ్వానించేవారని అంటారీమె. తన కెరియర్ ను వారెప్పుడూ అడ్డుకోలేదనని, తాను కోరుకున్న దానికి ఆమోదం తెలిపేవారని అన్నారు.ఆమె కాలిఫోర్నియాలో ఓ కంపెనీ ఉపాధ్యక్షురాలిగా పనిచేసారు. పరిశోధన శాస్త్రవేత్తగా అక్కడెతో అనుభవం గడించారు. ఏరో డైనమిక్స్ ఉపయోగానికి సంబంధించిన సమర్థమైన మెళకువలు నేర్చుకున్నారు.  సిమ్యులేషన్, అనాలసిస్ ఆఫ్ ఫ్లో ఫిజిక్స్ తదితర వైవిధ్యమున్న అంశాలను శోధించారు. ఇదతా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కు దరఖాస్తు చేయకముందే జరిగింది.ఆమె 1983 లో విమానయాన శిక్షకుడు మరియు విమాన చోదక శాస్త్ర రచయిత ఐన జీన్-పియర్ హారిసన్ ను వివాహం చేసుకున్నారు, 1990 లో యునైటెడ్ స్టేట్స్ దేశ పౌరురాలిగా అయ్యారు.

 

1994 లో మొట్టమొదటి సారి కల్పనా చావ్లా పేరు ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే అప్పుడామెను "నాసా" వ్యోమగామిగా ఎంపిక చేసింది. నిజానికి కల్పనా చావ్లా "నాసా"కు దరఖాస్తు చేసేనాటికి ఆమెతో పాటు దాదాపు 2000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చెసుకున్నారు. అంతమందినీ పరిశీలించి... కేవలం 23 మందినే నాసా ఎంపిక చేసింది. 1995 లో మిగతా 22 మందితో కలసి నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్ని ఈమె పూర్తి చేసుకున్నారు. టెక్సాస్ లోని హూస్టన్ లో గల జాన్సన్ స్పేస్ సెంఆట్ర్లో తన శిక్షణ చాలా ఆనందంగా గడిచిందంటారీమె... అక్కది శిక్షణ గురించి వ్యాఖ్యానిస్తూ "శిక్షణ చాలా ఉత్కంఠభరితంగా తమాషాగా ఉండేది. తమాషాగానూ ఉండేది లెండి." అనేవారు. తరువాత పైలట్ గా వివిధ రకాల విమానాలు నడిపేందుకు అర్హత సాధించారు. 1997 లో కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడీమె 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్ష యానం చేశారు. 

వ్యోమగామిగా ఎంపికైన తర్వాత శిక్షణలో భాగంగా ఆమె ఎంత కష్టమైన పనినైనా దీక్షతో చేశారు. వ్యోమగాములందరూ కొండ ఎక్కుతున్నారు. వెంట తెచ్చుకున్న బరువూ మోయలేక ఒక్కొక్కరు వాటిని వదిలివేస్తూ ఉంటే ఆ వెనకే వస్తున్న కల్పన వాటిని మోసుకొచ్చేవారు. సహచర వ్యోమగాములు వారించిన తర్వాతే వాటిని వదిలివేసేవారు. శారీరక శ్రమ విషయంలో పురుషుల కంటే తాను తక్కువ కాదని నిరూపించుకున్నారు. కల్పన ఒక శక్తిగా ఎదిగారు. కనుకే 1988 లో నాసా లోని రీసెర్చి సెంటర్ లో సైంటిస్ట్ గా చేరిన కల్పన అయిదేళ్ళకే ఎన్నో పరిశోధనలు చేసి కాలిఫోర్నియా ఓవర్ సెట్ మెథడ్స్ వైస్ ప్రెసిడెంత్ గా ఎన్నికైనారు. 1995 లో నాసా వ్యోమగామి అభ్యర్థిగా ప్రకటించింది. 15 మంది వ్యోమగాములు కలసి కల్పన అంతరిక్షంలోకి వెళ్ళేందుకు మూడేళ్ళపాటు శిక్షణ తీసుకున్నారు. 1997 లో ఎస్‌టిఎస్ - 87 లో అంతరిక్షం పైకి వెళ్ళారు. 1997, నవంబరు 19 న మిషన్ స్పెషలిస్టుగా ఆరుగురు సభ్యులు గల చోదక సిబ్బందిలో ఒకరుగా 4 వ యు.ఎస్.మైక్రో గ్రావిటీ పేలోడ్ ప్లైట్ లో కొలంబియా "ఎస్‌టిఎస్ -87" మీద అంతరిక్షయానం చేసి సూర్యుని వెలుపలి వాతావరణాన్ని అధ్యయనం చేశారు.

రెండవసారి అంతరిక్ష యానాన్ని చేసే అవకాశం కూడా ఆమెకు లభించింది. 2003, జనవరి 16 న ఎస్‌టిఎస్-107 కొలంబియా స్పేస్ షటిల్ లో 16 రోజుల అంతరిక్ష పరిశోధనకు అంతరిక్షంలోకి వెళ్లడానికి నిర్ణయం జరిగింది.

NASA కెరీర్:

1995 లో NASA వ్యోమగామి కార్పస్ లో చేరారు మరియు 1996 లో మొదటి సారిగా అంతరిక్షయానం కోసం ఎన్నికైయ్యారు. దాన్ని STS-87 అని, కొలంబియా వ్యొమనౌక అని అంటారు. ఆమె మొదటి అంతరిక్ష ప్రయాణం 1997 నవంబర్ 19 న కొలంబియా వ్యొమనౌక (STS-87) లో ఆరు వ్యోమగాముల సభ్యులతో మొదలైంది. చావ్లా భారతదేశంలో పుట్టి అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి మహిళ మరియు భారత దేశ సంతతిలో అంతరిక్షయానం చేసిన రెండో వ్యక్తి. ఈమె, 1984 లో సోవియట్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షయానం చేసిన వ్యోమోగామి రాకేశ్ శర్మాను అనుసరించారు. ఆమె మొదటిసారి ప్రయాణంలో, చావ్లా భూగ్రహం చుట్టూ 252 సార్లు మొత్తం 10.4 మిలియన్ మైళ్ళ దూరాన్ని 360 గంటలకన్నా ఎక్కువ సేపు ప్రయాణం చేసారు. STS-87 సమయంలో, ఈమె తన బాధ్యతను సద్వినియోగం చేస్తూ స్పార్టన్ ఉపగ్రహం వదలగా, అది పనిచేయకపోవటం వల్ల, విన్‌స్టన్ స్కాట్ మరియు తకౌ డొఇ తప్పని స్థితిలో అంతరిక్షంలో ఉపగ్రహాన్ని పట్టుకోవటానికి నడిచారు. నాసా విచారణ తర్వాత, తప్పులు సాఫ్టవేర్ లో మరియు విమాన సభ్యులకి నిర్వచించిన పద్ధతులు ఇంకా భూమి నుండి అదుపు చేయటం లోనే ఉన్నాయని, చావ్లా తప్పేమీ లేదని తేల్చి చెప్పింది.

STS-87 ముగింపు పనులు పూర్తి అయిన తర్వాత, వ్యోమగాముల ఆఫీసులో చావ్లాను సాంకేతిక స్థానంలో నియమించారు. ఇక్కడ ఈమె పనిని గుర్తించి, సహుద్యోగులు ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారు.

2000 లో, STS-107 ఈమెను రెండవసారి అంతరిక్ష యానం చేయటానికి మిగిలిన సభ్యులతోపాటు ఎన్నుకున్నారు. ఈ క్షిపణి, నిర్ణీత కాలం నిశ్చయించటంలో విభేదాలు మరియు సాంకేతిక సమస్యలు, ఎలాంటివంటే 2002 లో గుర్తించిన నౌకా ఇంజనులో బీటలు వంటివాటివల్ల పలుమార్లు ఆలస్యం జరిగింది. 2003 జనవరి 16, చివరగా చావ్లా తిరిగి కొలంబియా , విధివంచితమైన STS-107 క్షిపణిలో చేరారు.చావ్లా బాధ్యతలలో SPACEHAB/BALLE-BALLE/FREESTAR మైక్రో గ్రావిటీ ప్రయోగాలు ఉన్నాయి, వీటి కోసం భూమీ ఇంకా అంతరిక్ష విజ్ఞానం, నూతన సాంకేతిక అభివృద్ధి మరియు వ్యోమగాముల ఆరోగ్యం ఇంకా వారి జాగ్రత మీద సభ్యులు 80 ప్రయోగాలు చేసారు.

1991 లో భర్తతో కలసి చావ్లా, తన కుటుంభ సభ్యులతో సెలవలు గడపటానికి చివరిసారిగా భారతదేశం వచ్చారు. వివిధ కారణాలవల్ల, చావ్లా వ్యోమగామి ఐన తర్వాత భారతదేశం రమ్మని ఆహ్వానించినప్పటికి ఆమె దానిని అనుసరించ లేక పోయారు.

చివరిగా ఆమె 2003 లో ఫిబ్రవరి 1 న కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదంలో మరణిచారు.

 

©2019 APWebNews.com. All Rights Reserved.