89 సంవత్సరాల వయసులో ఉన్న మహిళలు ఏం చేస్తారు? రామ రామ అనుకుంట కాలం వెళ్లదీస్తారు. మనుమలు, మునిమరాళ్లతో కాలాన్ని గడుపుతారు. లతికా చక్రవర్తి మాత్రం అలా చేయడం లేదు. చెక్కుడు సంచులు కుట్టి అమ్ముతున్నది. అదీ ఓ వెబ్‌సైట్ ప్రారంభించి..!

 

విశాలమైన ఈ ప్రపంచంలో.. 
చిన్నచిన్న భవంతులు.. వాహనాలు.. 
మైదానాలు.. ఇతరత్రా అన్నీచిన్నగానే కనిపిస్తాయి.. 
కానీ కొన్ని మాత్రం అసాధారణంగా పే..ద్దగా తయారు చేశారు మనుషులు.. 
ఇలాంటివి కొన్ని మాత్రమే ఈ భూమ్మీద ఉన్నట్లు నిర్ధారణ అయింది కూడా.. 
మరి ఆ పే..ద్ద ప్రపంచాన్ని చుట్టేయడానికి సిద్ధమైపోయారా?
లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ.. 
సరికొత్త ప్రపంచంలోకి..

పోలీసులనగానే శిక్షలు, నేరాలు, ఫిర్యాదులే గుర్తుకు వస్తాయి. కానీ చెన్నైలోని నంగనల్లుర్ సమీపంలో ఉన్న పజావంతగల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారులు అనాథైన ఓ తల్లిని చేరదీసి, ఆమెకు ఉపాధి కల్పించారు. ఆమె బాగోగులు చూసుకుంటూ అమ్మ స్థానం ఇచ్చారు. అంతేనా.. తన తొలి పుట్టినరోజును ఘనంగా చేసి, తల్లి కళ్లలో ఆనందాన్ని చూశారు.

ఎవరైనా వయసు అడిగితే.. సంవత్సరాల్లో చెబుతాం. అయితే కాలిఫోర్నియాలోని నాష్‌విల్లేకు చెందిన ఈ అమ్మడిని వయసు అడిగితే 336 నెలలు అంటున్నది. ఇందులో కన్‌ఫ్యూజన్ ఏం లేదు. తన 28వ పుట్టినరోజుని కొత్తగా జరుపుకునేందుకు ఇలా నెలల పాపగా మారిపోయింది.

ఒక భవనం కట్టాలంటే ముందుగా పునాది తీయాలి. కానీ ఆ ఐదంతస్థుల మేడను పునాది లేకుండానే నిర్మించారు. అంతేకాదు లోపలకి వెళ్లడానికి ప్రధాన ద్వారం కూడా లేదు. పై అంతస్థుకు వెళ్దామంటే మెట్లు కూడా కనిపించవు. ఈ ప్రత్యేకతలన్నీ హవా మహల్‌లో కనిపిస్తాయి.

మామూలు మనుషులైతే వయసు మీద పడుతున్న కొద్దీ.. స్పీడు తగ్గిపోతుంది. ఒంట్లో పట్టు సన్నగిల్లుతుంది. కానీ కొంతమంది మాత్రం సూపర్‌పవర్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న బామ్మ కూడా అంతే. 

సముద్రం అడుగున నిద్రించాలని ఉందా? మీ పార్టనర్‌తో కలిసి ఆ సంతోష క్షణాలను ఆస్వాదించాలని ఉందా? అయితే మీలాంటి వారికోసమే సముద్రగర్భంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో గదులను నిర్మించి కొత్త జంటలను ఆహ్వానిస్తున్నారు. అయితే, ఇక్కడ స్టే చెయ్యాలంటే కొంచెం భారీగానే ఖర్చుపెట్టాలి మరి.

వందేళ్ల వయసులో రోజూ ఆఫీసుకెళ్తూ.. వివిధ డిపార్ట్‌మెంట్‌ల హెడ్‌లతో మీటింగ్‌లు నిర్వహించే చాంగ్.. ప్రపంచంలోనే అతిపెద్ద వయస్కుడైన బిలియనీర్‌గా గుర్తింపు పొందారు..వందేళ్ల వయసులో మీరేం చేద్దాం అనుకుంటున్నారు..?

డీలక్స్ హోటల్, స్టార్ హోటల్, ఫైవ్‌స్టార్ హోటల్ ఇలా ఎన్నో రకాల హోటల్స్ చూసే ఉంటారు. కానీ ఇదొక వింత హోటల్. ఇలాంటిది మీరెప్పుడు చూసి ఉండరు. అదేంటో తెలుసా? ఉప్పుహోటల్.

Page 1 of 16

©2019 APWebNews.com. All Rights Reserved.