మెట్రో పర్యావరణ పందిరి

దిల్లీ: సుందరీకరణ ఓ వైపు, పర్యావరణ హితం మరోవైపు. దిల్లీలోని మెట్రో స్తంభాలకు పచ్చని తీగలు పెనవేసుకున్నాయి. నిటారుగా ఉద్యానవనాలు ఏర్పాటు చేసి నగరాన్ని హరితశోభితంగా తీర్చిదిద్దుతున్నారు. పచ్చదనం తొణికిసలాడేలా ప్రధాన కూడళ్లతో పాటు అవకాశం ఉన్నచోటల్లా వర్టికల్‌ గార్డెన్స్‌ పెంచుతున్నారు. దేశంలో ఇప్పటికే బెంగళూరు, కొచ్చిలో ఉన్న విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. ఈ విధానం పై ప్రత్యేక కథనం..

శ్రీవారి సేవలో న్యాయమూర్తులు

తిరుమల: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌ గొగోయ్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తులకు తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

 
లండన్‌లో జరిగిన ప్రపంచస్థాయి గణిత పోటీల్లో భారత సంతతి బాలిక సత్తా చాటింది. న్యూదిల్లీలో జన్మించిన ఎనిమిదేళ్ల చిన్నారి సోహినిరాయ్ చౌదరి ప్రతిష్టాత్మక ''మ్యాథ్లెటిక్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌''లోకి ప్రవేశించిన బాలికగా ఘనత సాధించింది. ప్రైమరీ స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించిన గణిత ఆధారిత ఆన్‌లైన్ పోటీల్లో బర్మింగ్‌హమ్‌లోని నెల్సన్ ప్రైమరీ స్కూల్‌ తరఫున ఆమె పోటీల్లో పాల్గొంది. బ్రిటన్, ఇతర దేశాలకు చెందిన దాదాపు 100 మంది విద్యార్థులతో పోటీపడి.. ప్రతిష్టాత్మక ''మ్యాథ్లెటిక్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌''లో చోటు సంపాందించింది. మ్యాథమెటికల్ పజిల్స్‌ను వేగంగా, కచ్చితత్వంతో పూర్తిచేసి తన ప్రతిభను చాటుకుంది.

న్యూఢిల్లీ : ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా ఎక్కువ కాలం పాటు సెలవులు పెట్టిన ఉద్యోగులపై దేశీయ రైల్వే చర్యలు తీసుకోబోతుంది. వారిని సర్వీసు నుంచి తొలగించేందుకు సిద్ధమవుతోంది.  అనధికారికంగా సెలవులు పెట్టిన వారు 13వేల మందికి పైగా ఉన్నారని ఇటీవల రైల్వే గుర్తించింది. ఆర్గనైజేషన్‌ పనితీరును మెరుగుపరచడానికి రైల్వే ఓ డ్రైవ్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ డ్రైవ్‌ ద్వారా ఉద్యోగుల్లో నిజాయితీని, శ్రద్ధను పెంచడం వంటివి చేస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులపై తీసుకోబోయే ఈ చర్యలు కూడా ఈ క్యాంపెయిన్‌ కిందవేనని రైల్వే పేర్కొంది. 

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.