ఎపి వెబ్ న్యూస్.కామ్ 

అణ్వాయుధాలను వదిలిపెట్టాలని అమెరికా బలవంతం చేస్తే డోనాల్డ్‌ట్రంప్‌తో కిమ్‌జోంగ్‌ ఉన్‌ భేటీని పునఃపరిశీలిస్తామని ఉత్తరకొరియా హెచ్చరించింది.

త్రిపురలో ప్రారంభమైన పోలింగ్‌

అగర్తల: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 60 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో 59  స్థానాల్లో ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. చరిలాం స్థానంలో సీపీఎం అభ్యర్థి మృతితో పోలింగ్‌ మార్చి 12కు వాయిదా పడింది. పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. పోలింగ్‌ నిమిత్తం 3,214 కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం ఓట్లరు 25.73 లక్షలు కాగా.. వీరిలో పురుష ఓటర్లు 13.05 లక్షలు, మహిళలు 12.68 లక్షలు ఉన్నారు. పోలింగ్‌ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు పటిష్ఠం చేశారు.

మెట్రో పర్యావరణ పందిరి

దిల్లీ: సుందరీకరణ ఓ వైపు, పర్యావరణ హితం మరోవైపు. దిల్లీలోని మెట్రో స్తంభాలకు పచ్చని తీగలు పెనవేసుకున్నాయి. నిటారుగా ఉద్యానవనాలు ఏర్పాటు చేసి నగరాన్ని హరితశోభితంగా తీర్చిదిద్దుతున్నారు. పచ్చదనం తొణికిసలాడేలా ప్రధాన కూడళ్లతో పాటు అవకాశం ఉన్నచోటల్లా వర్టికల్‌ గార్డెన్స్‌ పెంచుతున్నారు. దేశంలో ఇప్పటికే బెంగళూరు, కొచ్చిలో ఉన్న విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. ఈ విధానం పై ప్రత్యేక కథనం..

శ్రీవారి సేవలో న్యాయమూర్తులు

తిరుమల: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌ గొగోయ్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తులకు తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

 
లండన్‌లో జరిగిన ప్రపంచస్థాయి గణిత పోటీల్లో భారత సంతతి బాలిక సత్తా చాటింది. న్యూదిల్లీలో జన్మించిన ఎనిమిదేళ్ల చిన్నారి సోహినిరాయ్ చౌదరి ప్రతిష్టాత్మక ''మ్యాథ్లెటిక్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌''లోకి ప్రవేశించిన బాలికగా ఘనత సాధించింది. ప్రైమరీ స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించిన గణిత ఆధారిత ఆన్‌లైన్ పోటీల్లో బర్మింగ్‌హమ్‌లోని నెల్సన్ ప్రైమరీ స్కూల్‌ తరఫున ఆమె పోటీల్లో పాల్గొంది. బ్రిటన్, ఇతర దేశాలకు చెందిన దాదాపు 100 మంది విద్యార్థులతో పోటీపడి.. ప్రతిష్టాత్మక ''మ్యాథ్లెటిక్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌''లో చోటు సంపాందించింది. మ్యాథమెటికల్ పజిల్స్‌ను వేగంగా, కచ్చితత్వంతో పూర్తిచేసి తన ప్రతిభను చాటుకుంది.
©2019 APWebNews.com. All Rights Reserved.