అమెరికా ఒత్తిడి చేస్తే భేటీపై పునరాలోచిస్తాం..!

ఎపి వెబ్ న్యూస్.కామ్ 

అణ్వాయుధాలను వదిలిపెట్టాలని అమెరికా బలవంతం చేస్తే డోనాల్డ్‌ట్రంప్‌తో కిమ్‌జోంగ్‌ ఉన్‌ భేటీని పునఃపరిశీలిస్తామని ఉత్తరకొరియా హెచ్చరించింది.

అణ్వాయుధాలను త్యజించాలని ఏకపక్ష డిమాండ్లతో తమను ఇరుకున పెట్టాలని అమెరికా చూస్తే చర్చల ప్రసక్తే ఉండదని తేల్చిచెప్పింది. జూన్‌ 12న సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్‌, ఉత్తరకొరియా అధినేత కిమ్‌ భేటీ కావాల్సి ఉంది. అమెరికా వైఖరి మారకపోతే ఇరుదేశాధినేతల మధ్య సమావేశం జరగబోదని ఉత్తరకొరియా ప్రకటనలతో ఈ భేటీపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ట్రంప్‌, కిమ్‌ భేటీకి సన్నాహాలు చేస్తున్నామని.. ఉత్తరకొరియా ప్రకటనలపై తమకు సమాచారంలేదని అమెరికా ప్రభుత్వం తెలిపింది. బుధవారం దక్షిణకొరియాతో జరగాల్సిన ఉన్నతస్థాయి చర్చలను కూడా ఉత్తరకొరియా రద్దు చేసుకుంది. అమెరికాతో కలిసి దక్షిణకొరియా ఉమ్మడిగా సైనిక విన్యాసాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా, దక్షిణకొరియా ఉమ్మడి సైనిక విన్యాసాలు తమను రెచ్చగొట్టేలా ఉన్నాయని.. తమపై దాడి చేసే ముందస్తు సైనిక విన్యాసాలుగా వాటిని భావిస్తున్నట్లు ఉత్తరకొరియా వార్తాసంస్థ పేర్కొంది.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.