మాములుగా స్మార్ట్ ఫోన్లకు ముందు , వెనుక కెమెరాలు ఉంటాయని మాత్రమే తెలుసు..కానీ 9 కెమెరాలు కలిగిన ఫోన్ ను మీరు ఎప్పుడైనా చూసారా..లేదా అయితే అతి త్వరలో అలాంటి ఫోన్ ను చూడబోతున్నారు.

ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే జియో..తాజాగా జియో డాంగిల్‌ ఫై భారీ ఆఫర్ ను ప్రకటించి మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

 

కాలం మారిపోయింది.. ఎవరి జేబులో డబ్బులుండటం లేదు. అంటే పైసలు లేవని కాదు. కార్డల నుంచే డబ్బు చెల్లిస్తున్నారు. అదేనండీ.. ఆన్‌లైన్ చెల్లింపులు. ఏదైనా వస్తువు కొన్నా ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా చెల్లిస్తున్నారు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా, ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవాలన్నా.. అంతా ఆన్‌లైన్‌లోనే. ఇది గమనించిన సైబర్ నేరగాళ్లు కొందరి ఖాతాల్లో డబ్బుకు మంగళం పాడుతున్నారు. ఆశ చూపి అదునుగా దోచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లు ఈ మధ్యఎక్కువయ్యారు.. పారాహుషార్ అంటూ ఎక్స్‌పీరియన్స్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఆన్‌లైన్‌లో మోసపోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి. 

ఇదంతా ఆన్‌లైన్‌లో నమ్మించి మోసం చేసే బాపతు. మీలో ఇలాంటి ఘటనలు చాలామందికి ఎదురై, డబ్బులు పోగొట్టుకునే ఉంటారు. ఇకపై అలా జరకూడదనుకుంటే.. మరోసారి మోసపోకూడదనుకుంటే జాగ్రత్తగా ఉండడం ఒక్కటే మార్గం. అందుకు ఇలా చేయండి.

 నెట్‌సెంటర్‌లో వద్దు

ఎట్టి పరిస్థితుల్లో మీ ఫైనాన్షియల్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ సైబర్ కేఫ్‌లలో చేయకండి. మీరు ట్రాన్సాక్షన్స్ చేసిన కంప్యూటర్ మీ తర్వాత ఇంకెవరైనా వాడొచ్చు. పైగా ఇంటర్నెట్ సెంటర్లలో కంప్యూటర్లకు లాక్ సిస్టమ్ ఉండదు. సెక్యూరిటీ కూడా అంతంత మాత్రమే. అలాంటి ప్రదేశంలో మీ ఆర్థిక లావాదేవీలు జరిపితే దొంగకు సెక్యూరిటీ పిన్ నెంబర్ చెప్పినట్టే. మీకు ఎంత నమ్మకమైన నెట్‌సెంటర్ అయినా సరే.. ఎట్టి పరిస్థితుల్లో మీ ఆన్‌లైన్ మనీ ట్రాన్సాక్షన్స్ అక్కడ చేయకండి. మీరే కాదు.. ఎవరు చేసినా హెచ్చరించండి. డబ్బులు ఎవరికైనా డబ్బులే కదా! నెట్‌సెంటర్ మాత్రమే కాదు.. ఆఫీస్ కంప్యూటర్‌లో కూడా. ఎందుకంటే ఆఫీసుకు సంబంధించిన కంప్యూటర్ పాస్‌వర్డ్స్, సెక్యూరిటీ కోడ్స్ అన్నీ టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌కి తెలిసిపోతాయి. డబ్బుల విషయంలో అందరినీ నమ్మలేం కదా! రిస్క్ చేయడం ఎందుకు? ఓసారి ఆలోచించండి.

సొంతమైతే బెటర్

ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ చేయొద్దంటే మీతో పాటు నిత్యం డబ్బులు మోసుకెళ్లమని కాదు. మీ ట్రాన్సాక్షన్ సేఫ్‌గా ఉండేలా జాగ్రత్తపడమని అర్థం. అలా ఉండాలంటే మీ సొంత లాప్‌టాప్, కంప్యూటర్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ చేయండి. మీ సొంత కంప్యూటర్‌లో అయితే.. వైరస్, మాల్‌వేర్ సైట్స్‌ని డిటెక్ట్ చేసే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటారు కదా! సేఫ్‌గా ఉంటుంది. మీకు, మీరు బాగా నమ్మే కుటుంబ సభ్యులకు తప్ప మీ పీసీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్స్ ఎవరికీ చెప్పొద్దు.

ఎంపికలో జాగ్రత్త

డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కి సంబంధించిన పాస్‌వర్డులు తేలికగా మర్చిపోకుండా ఉండేందుకు చాలామంది ఈజీ పాస్‌వర్డ్ సెలక్ట్ చేసుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మీ పాస్‌వర్డ్ ఎంత తేలికగా ఉంటే మీ ఖాతాలో దొంగలు పడడానికి అంత అవకాశం ఉన్నట్టు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కి పాస్‌వర్డ్ పెట్టుకునే ముందు కింద ఇచ్చే సలహలు, సూచనలు చదివి పాటించండి. పుట్టినరోజు, ఫోన్‌నెంబర్‌ల చివరి నంబర్లు, పేర్లు, ముద్దుపేర్లు, వరుస నంబర్లు లాంటివి పెట్టుకోవడం మంచిది కాదు. అలాంటి పాస్‌వర్డ్‌లను చేధించడం సైబర్ నేరగాళ్లకు కష్టమేమీ కాదు.

జాగ్రత్త సుమా!

మీ పాన్‌కార్డ్, డెబిట్, క్రెడిట్‌కార్డు, ఆర్బీఐ, సెబీ, బ్యాంకుఖాతాలు, పాస్‌వర్డ్‌లు ఎట్టి పరిస్థితిలో ఎవరికీ చెప్పకండి. వీటి వివరాలు అడుగుతూ వచ్చే ఈమెయిల్స్‌కి ఎట్టి పరిస్థితుల్లోనూ రిైప్లె ఇవ్వకండి. మేం మీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ అకౌంట్, డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు, పాస్‌వర్డ్ చెప్పండి అంటూ వచ్చే ఫోన్‌కాల్స్‌కి అస్సలు స్పందించవద్దు. బ్యాంకులు ఖాతాదారులకు పాస్‌వర్డ్ ఇవ్వడం వరకే.. అది కూడా వారు చూడకుండానే ఇస్తారు. అలాంటిది మీ పాస్‌వర్డ్‌ను బ్యాంకు వాళ్లెందుకు అడుగుతారు. అందుకే అలాంటి కాల్స్, మెసేజ్‌లు, మెయిల్స్‌కి స్పందించకండి.

 పంచుకోకండి..

మీ బ్యాంకుకు సంబంధించిన ఎలాంటి వివరాలు అపరిచితులతో, ఇతరులతో పంచుకోవడం అంత శ్రేయస్కరం కాదు. ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నమ్మకమైన వివరాలుంటేనే, సదరు వ్యక్తి మీకు బాగా తెలిసినవారు అయితేనే ఆన్‌లైన్‌లో మనీ ట్రాన్సక్షన్ చేయండి. మీ పాస్‌వర్డ్, యూజర్‌నేమ్, కార్డుకు సంబంధించిన వివరాలు ఎలాంటి పరిస్థితిలో షేర్ చేసుకోకండి.

 చెక్ చేసుకోండి..

సెక్యూర్ సాకెట్ లేయర్ లేని వెబ్‌సైట్ల జోలికి అస్సలు వెళ్లకండి. అలాంటి సైట్లోకి లాగిన్ కావడం అంటే మీ అకౌంట్‌లోకి దొంగలను ఆహ్వానించడమే. https:// అని కాకుండా http:// అని ఉంటే అనుమానించాల్సిందే.

 ఫిర్యాదు చేయండి

మీకు తెలియకుండా మీ అకౌంట్‌లో ఏవైనా ట్రాన్సాక్షన్స్ జరిగితే వెంటనే మీ అకౌంట్ ఉన్న బ్యాంక్‌లో ఫిర్యాదు చేయండి. మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీ అకౌంట్‌ని బ్లాక్ చేయమనండి. లేకపోతే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా లేకపోతే నష్టపోయిన మొత్తాన్ని తిరిగి పొందడం అసాధ్యమనే విషయం గుర్తు పెట్టుకోండి. ఎంత డిజిటల్ చెల్లింపులు చేసినా.. సెక్యూరిటీ లేకుంటే నష్టమే. అందుకే మీరు చేసే ప్రతీ ఆన్‌లైన్ ట్రాన్సక్షన్‌కి కచ్చితత్వం ఉందా? నమ్మగలిగినదేనా? అని నిర్ధారించుకున్నాకే ముందుకు వెళ్లండి. రిస్క్ తీసుకోకండి.

-ఆన్‌లైన్‌లో బంపర్ ఆఫర్.. పదివేలకే యాపిల్ ఫోన్ యాడ్ చూసి ఫోన్ బుక్ చేసింది రవళి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేకపోవడం, ఆఫర్ ముగుస్తుందేమో అన్న ఆత్రుతతో డెబిట్ కార్డుతో ముందే డబ్బు చెల్లించింది. మూడు రోజుల్లో మీ ఫోన్ డెలివరీ చేస్తాం అని రిైప్లె వచ్చింది. కొత్త ఫోన్ వస్తుందన్న సంబురంతో పాత ఫోన్‌ని పట్టించుకోవడం మానేసింది. చేతిలోంచి ఫోన్ జారిపోయి కిందపడ్డా బాధపడడం లేదు. మూడురోజులు గడిచాయి. నాలుగు, ఐదు, వారం నెలరోజులు గడిచినా ఫోన్ రాలేదు. ఎలాంటి రిైప్లె రాలేదు. ఫోన్ కోసం కట్టిన డబ్బులు పోయాయని తెలిసేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

అర్జంటుగా డబ్బులు కావాలి అని ఫ్రెండ్ పంపిన మెసేజ్ చూసి ఏదో ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ అని గూగుల్‌లో సెర్చ్ చేసి కనిపించిన ఓ సైట్ నుంచి హడావిడిగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాడు కమల్. డబ్బులు పంపాను రా అని ఫ్రెండ్‌కి మెసేజ్ చేశాడు. నాకు రాలేదు.. అకౌంట్ నెంబర్ కరెక్ట్ కొట్టావా అని ఫ్రెండ్ నుంచి రిైప్లె. కంగారుతో మరోసారి చెక్ చేసుకున్నాడు కమల్. అన్నీ కరెక్టే ఉన్నాయి. కానీ డబ్బులు మాత్రం సెండ్ కాలేదు. అప్పుడర్థమైంది కమల్‌కి మోసపోయానని.

బోగస్ సైట్లతో భద్రం!

డిజిటల్ లావాదేవీలతో ఏం కొనాలన్నా.. ఏం చేయాలన్నా అన్నింటికీ ఆన్‌లైన్ మీదే ఆధారపడుతున్నారిప్పుడు జనాలు. అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ కామన్ వస్తువుగా మారిపోవడంతో ఈ ఆన్‌లైన్ షాపింగ్ మరింత ఈజీ అయింది. అయితే ఆన్‌లైన్ షాపింగ్ వల్ల మోసాలు జరిగే ప్రమాదముంది. తస్మాత్ జాగ్రత్త..
-మార్కెట్లో పాపులర్ అయిన ఈ కామర్స్ సైట్లల్లో మాత్రమే మీరు కొనాలనుకున్న వస్తువు కొనండి. ఫేక్ ఈ కామర్స్ వెబ్‌సైట్ల వల్ల మోసపోయే ప్రమాదముంది.
-ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు కొనేముందు ఆ వెబ్‌సైట్ రివ్యూ, రేటింగ్‌లు పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటేనే షాపింగ్ చేయండి.
-సెక్యూరిటీ ఉన్న వెబ్‌సైట్‌లోకి మాత్రమే లాగిన్ కండి. వెబ్‌సైట్ యూఆర్‌ఎల్ https:// తో మొదలయ్యే సైట్ సెక్యూర్డ్ వెబ్‌సైట్ అన్నమాట. 
-ఆన్‌లైన్‌లో ఏ వస్తువు కొన్నా..వస్తువు డెలివరీ అయ్యేదాకా దాని తాలూకు లావాదేవీల ప్రింటవుట్ మీ దగ్గర ఉంచుకోండి.
-షాపింగ్ పూర్తయిన తర్వాత అకౌంట్ లాగిన్ చేయడం అస్సలు మరిచిపోవద్దు.
-సెక్యూరిటీ కోడ్, పాస్‌వర్డ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

ప్రతిరోజూ ఉదయం పరుగెత్తడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి దూరమవ్వడమేగాక, నెగిటివ్‌ ఆలోచనలను కూడా దూరం పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

టెక్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌ అనుబంధ సంస్థ వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. వ్యక్తుల నుంచి, గ్రూపుల్లో వచ్చే మీడియాను ఫోన్‌ గ్యాలరీలోకి రాకుండా నియంత్రించే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.

వాట్సాప్‌లో బ్యాంకు మెసేజ్‌లు రావడం ఎప్పుడైనా చూశారా? లేదు కదూ! కానీ ఇక నుంచి చూడబోతారు. భారత్‌లో టాప్‌ బ్యాంకులన్నీ ఇక నుంచి వాట్సాప్‌ ద్వారానే తన కస్టమర్లతో సంభాషించాలని చూస్తున్నాయి.

ఫీచర్‌ఫోన్లను దాటుకొని స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత అనేక ఫీచర్లు, ఆప్షన్లు లాండ్ ఫోన్‌ని నిర్లక్ష్యానికి గురి చేశాయి. ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి లాండ్‌ఫోన్‌కి మహర్దశ తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. అదేంటంటే..

స్మార్ట్ ఫోన్లు కొనాలనుకునే వారికీ తీపి కబురు తెలిపింది ఫ్లిప్ కార్ట్ . ‘ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ వీక్’ పేరుతో స్మార్ట్ ఫోన్ల ఫై భారీ ఆఫర్లను ప్రకటించింది.

Page 8 of 9

©2019 APWebNews.com. All Rights Reserved.