తలస్నానం చేసిన తరువాత రోజే జుట్టు జిడ్డుగా మారుతుంటుంది కొంతమందికి. దాంతో ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన పరిస్థితి. దాని వల్ల జుట్టు పొడిబారొచ్చు కానీ జిడ్డుతనం వదలదు. అలా కాకుండా ఉండాలంటే కింది చిట్కాలు పాటించండి.

నాకు మూడు వేల రూపాయల్లోపు మంచి బ్లూటూత్‌ హెడ్‌సెట్‌ సూచించగలరు.

మంచి ఆడియో క్వాలిటీ పరంగా చూస్తే సామ్‌సంగ్‌ సంస్థ విడుదల చేసిన లెవల్‌ యు వైర్‌లెస్‌ బ్లూటూత్‌ హెడ్‌సెట్‌ చాలా బాగుంటుంది. ఇది కాలర్‌ మోడల్‌.

దేశీయ టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో తాజాగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులోభాగంగా రూ.99 కే అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు.. 14 జీబీ డేటాను ఉచితంగా అందివ్వనుంది.

స్మార్ట్‌ఫోన్‌తో మీరు ఒక ఫోటో తీస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్‌ ఏంటో గుర్తించి దాన్ని బాగా తీయడానికి మీ ఫోన్‌ సలహాలు ఇస్తే ఎలా ఉంటుంది. నిలువున పోట్రెట్‌, ల్యాండ్‌స్కేప్‌ ఎలా తీయాలో నేర్పిస్తే ఇంకెలా ఉంటుంది. మీరు స్మార్ట్‌ ఫోన్‌తో రోజూ చేసే పనులను గుర్తించి మీకు రిస్కు లేకుండా అటోమేటిక్‌గా దానికదే చేసుకుంటే బాగుంటుంది కదా ! అది ఎలా సాధ్యం ? ఆ టెక్నాలజీ ఏంటీ ? అలాంటి ఫోన్లు ఏమైనా ఉన్నాయా.. ఓ లుక్కేద్దామా !

ప్రముఖ మొబైల్ తయారు సంస్థ ట్యాంబో తాజాగా భారత మొబైల్ మార్కెట్లోకి టీఏ 4 పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. దీని ధర రూ.6,999 గా సంస్థ నిర్ణయించింది. అలాగే ఈ ఫోన్ ఫై జియో రూ.2200 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను అందివ్వడం విశేషం.

 

ట్యాంబో టీఏ 4 ఫీచర్లు చూస్తే..

* 5.45 ఇంచ్ డిస్‌ప్లే
* 640 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
* 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
* 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్
* 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్)
* ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఐబాల్‌ సంస్థ తాజాగా మరో నూతన ల్యాప్‌టాప్‌ను ఇండియా మార్కెట్‌లోకి విడుదల చేసింది. కాంప్‌బుక్‌ మెరిట్‌ జీ9 పేరుతో విండోస్‌ 10 ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.13,999 ధరకే ఇది లభిస్తున్నది.

ల్యాప్‌టాప్‌లో ఏదైనా ముఖ్యమైన పనిచేస్తున్నప్పుడు బ్యాటరీ డెడ్ అయిపోతుంటుంది. ఆ సమయంలో చికాకు అంతాఇంతా కాదు. బ్యాటరీ లైఫ్‌ని మరింత పెంచేందుకు కొన్ని మార్గాలు.

-కొన్నిసార్లు యూఎస్‌బీలకు ఇతర డివైస్‌లను అంటే.. పెన్ డ్రైవ్‌లను, స్పీకర్‌లను పెట్టేస్తాం. ఆ తర్వాత తీయడం మరిచిపోతాం. దీనివల్ల   కూడా బ్యాటరీ త్వరగా అయిపోతుంది. కాబట్టి, వాటిని వెంటనే తొలగించండి. 
-సీడీ, డీవీడీ డ్రైవ్‌లను కూడా ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంచుకోవడం మరచిపోవద్దు. 
-స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎక్కువ పెడితే కానీ అక్షరాలు కనిపించవు. ఒకవేళ పనిచేయాలంటే కూడా బ్రైట్‌నెస్ ఎక్కువ ఉండాలనుకుంటారు. కానీ, పని అయిపోగానే ఆ బ్రైట్‌నెస్ కూడా తగ్గించేయండి. 
-స్పీకర్‌లను మ్యూట్‌లో పెట్టుకోవడం, మల్టీమీడియా సాఫ్ట్‌వేర్‌లకు దూరంగా ఉండడం ద్వారా బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. 
-స్క్రీన్‌సేవర్‌లను తీసేయడం, పనులను వీలైనంత త్వరగా ముగించుకోవడం చేయాలి. అప్పుడే బ్యాటరీ చార్జింగ్‌ని నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. 
-అధిక వేడి ల్యాప్‌టాప్ బ్యాటరీ బ్యాకప్‌ని దహించి
వేస్తుంది. అందుకే ల్యాపీని వేడి వాతావరణానికి దూరంగా ఉంచాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం కూడా ఉత్తమం. 
-ల్యాపీలోని సాఫ్ట్‌వేర్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి. ల్యాప్‌టాప్ బ్యాటరీని చార్జ్ చేసే క్రమంలో ఒరిజనల్ అడాప్టర్‌ను మాత్రమే ఉపయోగించడం మంచిది. 

టెలికాం రంగం లో పెను సంచలనాలు సృష్టిస్తూ వస్తున్నరిలయన్స్‌ జియో..తాజాగా మరో వార్త ను ప్రకటించి కస్టమర్లను ఆనందపరిచింది. ఇప్పటికే ‘జియోఫోన్‌’ పేరుతో ఫీచర్‌ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెల్సిందే..కేవలం రూ 1500 లకు ఈ ఫోన్ రావడం తో ఈ ఫోన్‌ కు భారీ డిమాండే ఏర్పడింది.

 

ఈ డిమాండ్ చూసిన యాజమాన్యం.. గురువారం సంస్థ 41వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ‘జియోఫోన్‌ 2’ విడుదల చేసి ఆకట్టుకున్నారు. ముఖేశ్‌ కుమార్తె ఈశా అంబానీ ‘జియోఫోన్‌ 2’ ను ఆవిష్కరించారు. ఆగస్టు 15న ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపింది. ఇది కూడా స్మార్ట్‌ ఫీచర్‌ ఫోన్‌ కావడం విశేషం. క్వెర్టీ కీప్యాడ్‌తో ఉండే ఈ ఫోన్‌లో హరిజాంటల్‌ స్క్రీన్‌ వ్యూ కూడా ఉంటుంది. దీని ధర రూ. 2,999గా ఉండనున్నట్లు సమాచారం.

Page 7 of 9

©2019 APWebNews.com. All Rights Reserved.