ప్రతిరోజూ ఉదయం పరుగెత్తడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి దూరమవ్వడమేగాక, నెగిటివ్‌ ఆలోచనలను కూడా దూరం పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

టెక్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌ అనుబంధ సంస్థ వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. వ్యక్తుల నుంచి, గ్రూపుల్లో వచ్చే మీడియాను ఫోన్‌ గ్యాలరీలోకి రాకుండా నియంత్రించే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.

వాట్సాప్‌లో బ్యాంకు మెసేజ్‌లు రావడం ఎప్పుడైనా చూశారా? లేదు కదూ! కానీ ఇక నుంచి చూడబోతారు. భారత్‌లో టాప్‌ బ్యాంకులన్నీ ఇక నుంచి వాట్సాప్‌ ద్వారానే తన కస్టమర్లతో సంభాషించాలని చూస్తున్నాయి.

ఫీచర్‌ఫోన్లను దాటుకొని స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత అనేక ఫీచర్లు, ఆప్షన్లు లాండ్ ఫోన్‌ని నిర్లక్ష్యానికి గురి చేశాయి. ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి లాండ్‌ఫోన్‌కి మహర్దశ తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. అదేంటంటే..

స్మార్ట్ ఫోన్లు కొనాలనుకునే వారికీ తీపి కబురు తెలిపింది ఫ్లిప్ కార్ట్ . ‘ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ వీక్’ పేరుతో స్మార్ట్ ఫోన్ల ఫై భారీ ఆఫర్లను ప్రకటించింది.

కొత్తగా ల్యాప్‌టాప్ కానీ పీసీ కానీ కొనుగోలు చేసారా…! అయితే మీకు ఫ్రీ గా ఇంటర్ నెట్ అందిస్తుంది ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్. బీఎస్ఎన్ఎల్ బీబీజీ కాంబో యూఎల్‌డీ 45జీబీ ప్లాన్‌ ప్రకటించిన సంగతి తెల్సిందే.

తన వినియోగదారుల సౌలభ్యం కోసం 'వాట్సాప్' మరో అదిరిపోయే ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా... మనం పొరపాటున డెలీట్ చేసిన మీడియా ఫైల్స్‌ను తిరిగి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అవును Mi ఫోన్ అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూసే అని చెప్పాలి కంపెనీ ఫేమస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఎంఐ ఏ1 స్మార్ట్ ఫోన్ ఇక నుంచి భారత్ లో అందుబాటులోకి ఉండదు. ఈ మేరకు షావోమి అధికారిక వెబ్సైటు ధృవీకరించింది. గతేడాదే లాంచ్ అయిన ఈ ఫోన్ కేవలం ఏడు నెలల కాలంలోనే నిలిపివేయబడింది. ఇందుకు కారణం ఎంఐ ఏ1 స్మార్ట్ ఫోన్ కు అడ్వాన్స్ గా సరికొత్త ఫీచర్లతో ఎంఐ ఏ2 స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఎంఐ ఏ1 ను నిలిపివేస్తుంది. కాగా ఈ ఫోన్ అనతికాలంలోనే యూజర్లను ఆకట్టుకుంది. కేవలం ఎంఐ ఏ1 స్మార్ట్ ఫోన్ తోనే షావోమికి గుర్తింపు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇదిలావుంటే కొత్తగా అందుబాటులోకి రానున్న ఎంఐ ఏ2  ఫోన్ లో ఫీచర్స్ ఈ విధంగా వుంటాయని టెకీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. 

6జీబీ ర్యామ్‌, 128జీబీ మోడల్‌
స్నాప్‌డ్రాగన్‌ 660 ప్రాసెసర్‌
5.99 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే
4జీబీ ర్యామ్‌, 32జీబీ వెర్షన్‌
6జీబీ ర్యామ్‌, 64జీబీ వెర్షన్
20మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా 
12మెగాపిక్సెల్‌, 20మెగాపిక్సెల్‌తో బ్యాక్‌ కెమెరాలు

పెద్దపిన్ను ఛార్జర్ ఉందా... సన్నపిన్ను ఛార్జర్ ఉందా.... ఇవి మనం ప్రతి ఇంట్లోనూ ఒక్కప్పుడు రెగ్యులర్‌గా విన్న మాటలు.... స్మార్ట్‌ఫోన్ల రాకతో ... ఈ మాటలు కూడా వినిపించకుండా పోయాయి. ఇప్పుడు ఎన్నోరకాల స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. వీటన్నింటికి వేర్వేరు రకాల ఛార్జర్లు వాడాల్సిందే. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ.... అన్నిరకాల ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఒకే ఛార్జర్‌ను రూపొందించారు. దీనిద్వారా ఒకేసారి 7 ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకునే వీలుంది. అయితే యూఎస్‌బీ సపోర్ట్‌తో పనిచేసే ఈ డివైజ్‌తో సెల్‌ఫోన్లు, కెమెరాలు, టాబ్లెట్స్, పవర్ కేబుల్స్, ట్రిమ్మర్స్, బ్లూటూత్ స్పీకర్స్ వంటి ఎలక్ట్రిక్ వస్తువులకు కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎల్‌ఈడీ సౌకర్యం కూడా ఈ పరికరంలో ఉంది. స్మార్ట్‌స్పీడ్ టెక్నాలజీతో ఈ డివైజ్ పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.1,500. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ వినియోగదారులకు లభ్యం అవుతుంది.

Page 6 of 6

©2018 APWebNews.com. All Rights Reserved.