ఎపి వెబ్ న్యూస్.కామ్
స్టేట్ బ్యూరో ఇంచార్జ్ :- మునిబాబు
సెల్‌ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగమై పోయింది. ఒక నిత్యావసర వస్తువుగా అవతరించిన క్రమంలో చేతిలో సెల్‌ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేం అనే స్థాయికి మనం చేరుకున్నాం.
ఇక సోషల్ మీడియాకు బానిసలైపోతున్న ప్రస్తుత తరుణంలో ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు సెల్ఫోన్లతోనే కాలక్షేపం.అయితే స్మార్ట్‌ఫోన్ వల్ల సాంకేతికంగా ఎన్ని ప్రయోజనాలున్నాయో.. వీటినుంచి వెలువడే రేడియేషన్‌తో ఆరోగ్యానికి ముప్పు కూడా అంతకంటే ఎక్కువే పొంచి వుంది. ఇది జగమెరిగిన సత్యం అయినా.. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జర్మన్ ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్ సంస్థ విడుదల చేసిన నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. షావోమి, వన్ ప్లస్‌కు చెందిన నాలుగు స్మార్ట్‌ఫోర్లు అతి ప్రమాదకరమైనవిగా పేర్కొంది.ముఖ్యంగా చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు రూపొందించిన నాలుగు స్మార్ట్ఫోన్లు గరిష్టంగా రేడియేషన్‌ను విడుదల చేస్తున్నాయని ఈ నివేదిక తేల్చింది. టాప్ 16 జాబితాలో ఎనిమిది ఫోన్లు షావోమి, వన్ ప్లస్‌కి చెందినవి ఉన్నాయని వెల్లడించింది. షావోమికి చెందిన ఆండ్రాయిడ్ వన్ స్మార్టఫోన్ ఎంఐఏ1, వన్ ప్లస్ 5టీ స్మార్ట్ఫోన్లు ముందువరుసలో ఉన్నాయి. షావోమి, వన్‌ప్లస్ తరువాత ఈ జాబితాలో యాపిల్ ఐ ఫోన్ 7 నిలిచింది. దీంతోపాటు యాపిల్ ఐ ఫోన్ 8, గూగుల్ పిక్సెల్ 3 , పిక్సెల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్ల రేడియేషన్ కూడా అత్యధికంగానే నమోదైందని రిపోర్టు చేసింది.