ఎపి వెబ్ న్యూస్.కామ్
స్టేట్ బ్యూరో ఇంచార్జ్ :- మునిబాబు
గ్రూప్ అడ్మిన్లకు పోస్ట్‌లను నియంత్రించే అధికారం.. త్వరలో కొత్త ఫీచర్
శాన్ఫ్రాన్సిస్కో, డిసెంబరు 2: వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది ఎవ్వరి మాటా వినరు.
అనవసరమైన మెసేజ్‌లు, వీడియోలు పోస్ట్ చేసి.. గ్రూపును డస్ట్‌బిన్‌గా మార్చేస్తూవుంటారు. దీంతో అసలు గ్రూప్ ఏర్పాటుచేసిన లక్ష్యమే దెబ్బతింటుంది. అలాంటివారిని కట్టడి చేయడానికి గ్రూప్ అడ్మిన్లకు వాట్సాప్ అవకాశం కల్పిస్తోంది. గ్రూపు సభ్యులు టెక్ట్స్ మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు, డాక్యుమెంట్లను అడ్మిన్లు నియంత్రించేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను తెస్తోంది. ‘రిస్ట్రిక్టెడ్ గ్రూప్’గా పిలిచే సెట్టింగ్‌ను యాక్టివేట్ చేసే అధికారం అడ్మిన్లకు మాత్రమే ఉంటుంది.
అడ్మిన్లు కోరుకుంటే.. గ్రూపు సభ్యులంతా మెసేజ్‌లను కేవలం చదవడానికి మాత్రమే పరిమితమవుతారు. వారికి స్పందించే అవకాశం ఉండదు. ఒకవేళ వాళ్లు ఏదైనా మెసేజ్ లేదా వీడియోని షేర్ చేయాలనుకుంటే..‘మెసేజ్ అడ్మిన్’ బటన్‌ను వాడాల్సివుంటుంది. అప్పుడు అడ్మినిస్ట్రేటర్అనుమతించిన తర్వాతే ఆ పోస్టు గ్రూపులోని మిగతా సభ్యులందరికీ చేరుతుందని వాబెటా ఇన్ఫో అనే వెబ్సైట్ వెల్లడించింది. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్నప్పటికీ త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఇటీవలే ‘డిలీట్ మెసేజ్ ఫర్ ఎవ్రీవన్’ అనే ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.