తక్కువ విద్యుత్‌తో ఎక్కువ రోజులు!

సాధారణంగా ప్రతీ ఇంట్లో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్స్, కూలర్ల ్ల వినియోగం ఎక్కువైపోయింది. ఎంతో ఖర్చుపెట్టి కొన్న డివైజ్ మన్నిక కాలం తగ్గిపోతుంది. విద్యుత్ ఖర్చు పెరిగిపోతుంది. ఈ కింది చిట్కాలు పాటించి ఎక్కువ రోజులు వచ్చేలా చూసుకోండి.

-కంప్యూటర్‌లో పనిపూర్తయిన తరువాత మళ్లీ వాడుకుంటాం కదా అని షట్‌డౌన్ చేయకుండా అలానే ఉంచుతాం.దానిని ఎప్పటికప్పుడు షట్ డౌన్‌చేయాలి. ఇలా చేయడం వల్ల కంప్యూటర్ మన్నికకాలం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
-కంప్యూటర్ స్క్రీన్ మీద అందమైన ఫొటో పెట్టి అందరూ చూస్తారని స్విచ్ ఆఫ్ చేయరు. దానివల్ల ఎక్కువ కరెంటు వృథా అవుతుంది. ఇలా వృథా అయిన కరెంటు ఒకరోజు రిఫ్రిజిరేటర్‌కి అయ్యే విద్యుత్‌తో సమానం. 
-కొంత సమయానికే షట్‌డౌన్ చేయడం ఎందుకు అనుకుంటే కనీసం మానిటర్ అయినా ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే సగం విద్యుత్ ఆదా అవుతుంది. కంప్యూటర్ వినియోగించుకునే విద్యుత్‌లో సగం మానిటర్‌కే సరిపోతుంది. కనీసం స్లీప్‌మోడ్ ఆప్షన్ అయినా తప్పనిసరిగా వాడాలి.
-ల్యాప్‌టాప్ ఉపయోగించుకున్న తరువాత చాలామంది చార్జర్‌ని ప్లగ్ బోర్డుకే ఉంచుతారు. ఈ సమయంలోనూ అది విద్యుత్‌ని స్వీకరిస్తుందని గ్రహించాలి. అలా అయ్యే వృథా నెలాఖరులో మీ బిల్లుని తడిసి మోపెడయ్యేట్లు చేస్తుంది. ఇంట్లో వాడే అన్ని చార్జర్‌ల విషయంలో ఈ జాగ్రత్త వహించాలి.
-ఫ్యాన్ వాడకం కంటే ఏసీ వాడకానికి ఎక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. కొన్ని పద్ధతులు పాటిస్తే కొంత ఆదా చేయవచ్చు. తలుపులు, కిటికీలు తెరిచి ఫ్యాన్ వేసి గదిని వీలైనంత వరకు చల్లబరుచాలి. ఆ తరువాత తలుపులు మూసి ఏసీ ప్రారంభిస్తే గది త్వరగా చల్లబడుతుంది.
-డాబాలపై గార్డెన్‌లను పెంచడం వల్ల కావలసిన ఆక్సిజన్ అందుతుంది. దాంతో ఏసీలు త్వరగా గదులని చల్లబరుస్తాయి. సుమారు నలభైశాతం విద్యుత్ ఖర్చు తగ్గుతుంది.

©2019 APWebNews.com. All Rights Reserved.