ఆల్కహాల్, కాఫీ తాగితే ఎక్కువ రోజులు బతుకుతారట! ఎవరు చెప్పారంటే..!

ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల ఎక్కువ రోజులు బతుకొచ్చని చాలామంది చెప్పేమాట. నిజంగా అలా పాటించే వాళ్లు ఎక్కువ కాలం బతుకుతున్నారా?

అవును అని బలంగా చెప్పలేం. కానీ కాఫీ, పరిమితమైన ఆల్కహాల్ తీసుకునే వాళ్లు ఎక్కువ కాలం బతుకుతారని ఓ అధ్యయనంలో వెల్లడయింది. కాలిఫోర్నియా యూనివర్సిటీకి సంబంధించిన ఇర్వైన్ ఇనిస్టిట్యూట్ జ్ఞాపకశక్తి, నరాల బలహీనత వంటి అంశాలపై పదిహేనేళ్లు అధ్యయనం జరిపింది. 90 యేండ్లు దాటిన తర్వాత వృద్ధులు ఎలా జీవిస్తున్నారు? వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి? జీవన శైలిలో ఎలాంటి మార్పులు సంభవించాయి? వంటి అంశాల ప్రాతిపదికను ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. మితంగా కాఫీ, ఆల్కహాల్ తీసుకున్న చాలామంది తొంభై యేండ్ల తర్వాత ఆరోగ్యంగా జీవిస్తున్నారని తేలింది. ఏదైనా అంతే మితంగా తీసుకుంటే మంచి జరుగుతుంది.

©2019 APWebNews.com. All Rights Reserved.