వాట్సాప్‌లోనూ యూట్యూబ్‌..!

వాట్సాప్‌ మెసేజ్‌లలో వచ్చే యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలను చూసేందుకు ఆయా యాప్‌లలోకి వెళ్లాల్సిన పనిలేకుండా వాట్సాప్‌లోనే చూసే విధంగా కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫీచర్‌ను 'పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌'గా పిలుస్తారు. ఇప్పటివరకు ఐఫోన్‌ వినియోగదారులకు మాత్రమే ఇది అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు కూడా దీన్ని వాట్సాప్‌ చేరువ చేసింది. దీని కోసం యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం మెసేజ్‌లలో వచ్చే లింక్‌పై క్లిక్‌చేస్తే చిన్న బాక్స్‌లో నేరుగా వీడియోలు ప్లే అవుతాయి. కావాలంటే వీటిని మధ్యలో నిలిపివేయొచ్చు. ఈ బాక్స్‌ను తెరపై ఎటు కావాలంటే అటు జరుపుకోవచ్చు. వీడియో ప్లే అవుతుండగానే మెసేజ్‌లు కూడా పంపుకోవచ్చు. గ్రూప్‌ చాట్‌లలోనూ ఈ ఫీచర్‌ పనిచేస్తుంది.

©2019 APWebNews.com. All Rights Reserved.