ఏడు ఫోన్లకు ఒకేసారి ఛార్జింగ్...!

పెద్దపిన్ను ఛార్జర్ ఉందా... సన్నపిన్ను ఛార్జర్ ఉందా.... ఇవి మనం ప్రతి ఇంట్లోనూ ఒక్కప్పుడు రెగ్యులర్‌గా విన్న మాటలు.... స్మార్ట్‌ఫోన్ల రాకతో ... ఈ మాటలు కూడా వినిపించకుండా పోయాయి. ఇప్పుడు ఎన్నోరకాల స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. వీటన్నింటికి వేర్వేరు రకాల ఛార్జర్లు వాడాల్సిందే. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ.... అన్నిరకాల ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఒకే ఛార్జర్‌ను రూపొందించారు. దీనిద్వారా ఒకేసారి 7 ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకునే వీలుంది. అయితే యూఎస్‌బీ సపోర్ట్‌తో పనిచేసే ఈ డివైజ్‌తో సెల్‌ఫోన్లు, కెమెరాలు, టాబ్లెట్స్, పవర్ కేబుల్స్, ట్రిమ్మర్స్, బ్లూటూత్ స్పీకర్స్ వంటి ఎలక్ట్రిక్ వస్తువులకు కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎల్‌ఈడీ సౌకర్యం కూడా ఈ పరికరంలో ఉంది. స్మార్ట్‌స్పీడ్ టెక్నాలజీతో ఈ డివైజ్ పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.1,500. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ వినియోగదారులకు లభ్యం అవుతుంది.

©2019 APWebNews.com. All Rights Reserved.