నంబర్‌ సేవ్‌ చేసుకోకుండానే మెసెజ్‌..!

ఎవరికైనా కొత్త వారికి వాట్సాప్‌లో మెసెజ్‌ చేయాలంటే నంబర్‌ సేవ్‌ చేసుకోవటం తప్పనిసరి. తాత్కాలిక అవసరం కోసమైనా సరే ఫోన్‌ బుక్‌లో నంబర్‌ సేవ్‌ చేయాల్సిందే. అలా కాకుండా నంబర్‌ సేవ్‌ చేయ కుండానే వాట్సాప్‌లో మెసెజ్‌ చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది.

ఆ సమస్యకు ఇప్పుడు పరిష్కారం దొరికింది. మొబైల్‌ నెంబర్‌ సేవ్‌ చేసుకోకుండానే వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌ పంపొచ్చు. మనతో అంతగా పరిచయం లేని వ్యక్తులకు ఒకటో రెండో, మెసేజ్‌లు పంపాల్సి రావచ్చు. తర్వాత మళ్లీ ఆ వ్యక్తులతో మనకు పని లేక పోవచ్చు. అయినా కానీ ఆ వ్యక్తి మొబైల్‌ నెంబర్‌ను ఇప్పటి వరకు కచ్చితంగా సేవ్‌ చేసుకున్న తర్వాతే మెసేజ్‌లు పంపాల్సి ఉంటుంది. దీని వల్ల మనతో పరిచయం లేని వ్యక్తులు వాట్సాప్‌లోని మన ప్రొఫైల్‌ ఫొటో చూసే అవకాశం ఉంది. ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. అలాగని థర్ట్‌ పార్టీ యాప్‌లను ఉపయోగించడం సెక్యూరిటీ పరంగా మంచిది కాదు. అయితే ఇప్పుడు మన మొబైల్‌ ఫోన్‌ బుక్‌లో నెంబర్‌ను సేవ్‌ చేయకుండానే వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌లను సులభంగా పంపేయచ్చు. దీనికోసం....మన ఫోన్‌లో వాడుతున్న బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయాలి. ఇందులో అడ్రస్‌ బార్‌లో... https://api.whats App.com/sendphone/ number  అని టైప్‌ చేయాలి. నంబర్‌ అన్న దగ్గర మనము ఎవరికైతే మెసేజ్‌ పంపాలనుకుంటున్నామో వారి మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. ఆ ఫోన్‌ నెంబర్‌ కంట్రీ కోడ్‌ను కూడా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎంటర్‌ బటన్‌ను ప్రెస్‌ చేయాలి. వాట్సాప్‌ విండో ఓపెన్‌ అవు తుంది. మీరు ఆ నెంబర్‌కు మెసేజ్‌ పంపాలనుకుంటున్నారా? అని వస్తుంది. ఆ తర్వాత మనము సెండ్‌ మెసేజ్‌ అని నొక్కాలి. వాట్సాప్‌ చాట్‌ విండో ఓపెన్‌ అవుతుంది. తర్వాత మనము వాళ్లకు మెసెజ్‌ చేయవచ్చు.

©2019 APWebNews.com. All Rights Reserved.