వైరస్‌ ఎలా వస్తుంది?

కంప్యూటర్‌ను పనిచేయించేందుకు మనం కొన్ని ఆజ్ఞలు (కమాండ్స్‌) వినియోగిస్తాం. ఈ కమాండ్స్‌ అన్నింటినీ కలిపి సాఫ్ట్‌వేర్‌ అంటారు.

కంప్యూటర్‌ ఏ పనులు ఏవిధంగా చేయాలనేది సాఫ్ట్‌వేర్‌ నిర్ణయిస్తుంది. కంప్యూటర్‌ పనితీరు గురించి క్షుణ్ణంగా అవగాహన ఉన్నవారు, కొంతమంది సరదా కోసమో, దురాలోచనతోనో కొన్ని రకాల సాఫ్ట్‌వేర్‌లను తయారుచేస్తారు. ఈ సాఫ్ట్‌వేర్‌లు కంప్యూటర్లను తప్పుదారి పట్టించడం, పనిచేయకుండా నిలిచిపోయేలా చేయడం వంటి సమస్యలను తెచ్చిపెడతాయి. ఇలాంటి సాఫ్ట్‌వేర్లనే 'వైరస్‌' అంటారు. అందుకే ప్రభుత్వ ఆమోదం పొందిన కంపెనీలు తయారుచేసిన, వైరస్‌లేని సాఫ్ట్‌వేర్‌ను వాడటం శ్రేయస్కరం. ఇంటర్‌నెట్‌ నుంచి సమాచారం తీసుకునేటప్పుడు ఈ-మెయిల్స్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మానవ వైరస్‌లకు 'టీకాలు' ఎలాగో కంప్యూటర్‌ వైరస్‌లను 'యాంటీ వైరస్‌' సాఫ్ట్‌వేర్ల ద్వారా నివారించొచ్చు.

©2019 APWebNews.com. All Rights Reserved.