మార్కెట్‌లోకి కొత్త ఆండ్రాయిడ్‌..!

మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టం విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న గూగుల్‌ ఆండ్రాయిడ్‌ 10 వసంతాలు పూర్తి చేసుకుంది.

సెప్టంబర్‌ 23, 2008 ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో మొట్టమొదటి ఫోన్‌ అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంకు ఎటువంటి కోడ్‌ నేమ్‌ను గూగుల్‌ పెట్టలేదు. దీంతో ఆండ్రాయిడ్‌ 1.0 పేరుతో ఈ ఆపరేటింగ్‌ సిస్టంను పిలిచేవారు. ఆ తరువాత 'పెటిట్‌ ఫోర్‌' పేరుతో ఆండ్రాయిడ్‌ 1.1 వెర్షన్‌ను గూగుల్‌ అందు బాటులోకి వచ్చింది. 2008లో మొదలైన ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టం ప్రస్థానం.. ఆ తర్వాత కప్‌కేక్‌, డోనట్‌, ఇక్లెయర్‌, ఫ్రోయో, జింజర్‌ బ్రెడ్‌, హనీకూంబ్‌, ఇస్‌క్రీమ్‌ శాండ్విచ్‌, జెల్లీబీన్‌, కిట్‌క్యాట్‌, లాలీపాప్‌, మార్ష్‌మల్లో, నౌగట్‌, ఓరియో పేర్లతో వివిధ వెర్షన్లను విడుదల చేసింది. ప్రస్తుతం రీఱవ (ఆండ్రాయిడ్‌ 9.0) వెర్షన్‌ అందుబాటులో ఉంది.కాగా, గూగుల్‌ తన మొదటి ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను 'జీ1' (ం1) పేరుతో అందుబాటులో తీసుకువచ్చింది. గూగుల్‌, హెచ్‌టీసీ ఇంకా టీ-మొబైల్‌ కాంబినేషన్‌ లో ఈ ఫోన్‌ రూపుదిద్దుకుంది. యాపిల్‌ ఐఫోన్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని విడుదల చేశారు. అయితే ఈ ఫోన్‌లో టచ్‌స్క్రీన్‌ సదుపాయం లేదు. స్లైడర్‌ కీబోర్డుతో డిజైన్‌ కాబడిన ఈ డివైస్‌లో టైపింగ్‌ ఇంకా నేవిగేషన్‌ కోసం ట్రాక్‌ బాల్‌ను హెచ్‌టీసీ ఏర్పాటు చేసింది. తన రెండవ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను 'గూగుల్‌ మ్యాజిక్‌' పేరుతో 2009లో విడుదల చేసింది. ఆ తరువాత సంవత్సరం నుంచి సామ్‌సంగ్‌, ఎల్‌జీ, మోటరోలా వంటి సంస్థలు ఆండ్రాయిడ్‌ ఆధారిత మొబైల్‌ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.

©2019 APWebNews.com. All Rights Reserved.