మీ సంతోషానికేది... స్టేటస్‌ అప్‌డేట్‌...

కొంచెం వెరైటీ బ్రేక్‌ఫాస్ట్‌ చేశారా... స్టేటస్‌ అప్‌డేట్‌..మీ ఫ్రెండ్‌కు పెళ్లి ఫిక్స్‌ అయిందా .. స్టేటస్‌ అప్‌డేట్‌.. పుట్టిన రోజు శుభాకాంక్షలయినా, పెళ్లికి హాజరయినా ఇప్పుడు వాట్సాప్‌ యూజర్లు చేస్తున్న ఒకేఒక్కపని స్టేటస్‌ అప్‌డేట్‌.. అవును.. ఆనందానికైనా, అవేశానికైనా, ఆపదలో అయినా ఇప్పుడు వాట్సాప్‌ స్టేటస్‌ ఓ ట్రెండ్‌గా మారింది.

టెక్నాలజీలో వస్తున్న కొత్త కొత్త ఫీచర్లతో మనం సగటు రోజులో మనం ఎంత సంతోషాన్ని ఎంత కోల్పోతున్నామో అర్థం చేసుకోలేకపోతున్నాం.. ఏ ఫీచరైనా మనకు ఆనందం కోసం, అవసరం కోసం ఉపయోగించాలి కానీ అలవాటుగా ఉపయోగిస్తు వ్యసనంగా మారేంత వరకు దారి తీయకుండా జాగ్రత్త పడటం అవసరం కదా 

ఉదయాన్నే నిద్ర లేవగానే చేతిలోకి ఫోన్‌ తీసుకొని వాట్సప్‌ మెసేజ్‌లు చదవడం అలవాటా? రాత్రి పడుకునే ముందు కూడా స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉండాల్సిందేనా..? యువతరంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య ఇదే. రోజులో సగటున 200 సార్లు స్మార్ట్‌ ఫోన్‌ను చూస్తున్నామట. అంటే ప్రతి ఆరున్నర నిమిషాలకు ఓసారైనా ఫోన్‌ చూడాల్సిందేనన్న మాట. నలుగురిలో ఒకరైతే నిద్రపోయే సమయం కంటే ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే గడుపుతున్నారని ఇటీవల సర్వేలు వెల్లడించాయి. దీన్ని బట్టే స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌కు మనం ఎంతగా బానిసలమయ్యామో అర్థం చేసుకోవచ్చు. ఇక 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్కుల్లో 70 శాతం మంది మాట్లాడం కంటే చాటింగ్‌ చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట. సగటున ఒక్కో టీనేజర్‌ బెడ్‌ మీది నుంచే నెలలో 3400 ఎలక్ట్రానిక్‌ మెసేజ్‌లను పంపిస్తున్నారట.
ఇంతకూ వాట్సప్‌ చూస్తే, ఆన్‌లైన్‌కు అడిక్ట్‌ అయితే ప్రాబ్లం ఏంటని అనుకుంటున్నారా..? పదే పదే వాట్సప్‌ మెసేజ్‌లను చెక్‌ చేయడం కోసం ఫోన్‌ చూడటం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. క్లాస్‌లో లెక్చరర్‌ చెప్పింది బుర్రకు ఎక్కదు. ఎదుటి వ్యక్తి చెప్పింది శ్రద్ధగా వినలేం. తను ఆన్‌లైన్‌లోనే ఉన్నాడు, కానీ రిప్లరు ఇవ్వట్లేదు, అంటే నన్ను పట్టించుకోవడం లేదనే తొందరపాటు అభిప్రాయాలకు వచ్చే వీలుంది. దీని వల్ల అనుబంధాలు దెబ్బతింటాయి. వాట్సప్‌లో మీరేం చేయనక్కర్లేదు, ఒక్కసారి స్టేటస్‌ పెట్టి చూడండి. మీ స్టేటస్‌ చూసినవారు ఎవరెలా రిప్లరు ఇస్తున్నారో మీకే తెలుస్తుంది. ఏ మాత్రం తేడాగా స్టేటస్‌ పెట్టినా ఇక అంతే సంగతులు, గాసిప్‌లకు ఛాన్స్‌ ఇచ్చినట్టే. లి వాట్సప్‌లో షార్ట్‌కట్‌లో మెసేజీలు పెట్టడం అలవాటైందా. దీని వల్ల అర్థం పర్థంలేని భాషలో ఎగ్జామ్స్‌ రాసే ప్రమాదం కూడా ఉంది. పరీక్షలో రాసే పదాల్లోనూ షార్ట్‌ కట్స్‌ వాడితే మనకు మార్కులు తగ్గడమే కాదు, పేపర్లు దిద్దేవారు బుర్రలు పీక్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
వాట్సాప్‌ వేదికగా ప్రతిఒక్కరూ తమ భావాలను పంచుకుంటు న్నారు. వాట్సాప్‌ మెసేజింగ్‌.. వాట్సాప్‌ కాలింగ్‌.. ఇంకా ఇతర ఫీచర్లు ఇప్పుడు జీవితంలో ఒక భాగమైపోయాయి. స్నేహితులు, ప్రేమికులు, బంధువులతో నిత్యం టచ్‌ ఉండేందుకు ఈ మీడియాను ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. అయితే... వాట్సాప్‌ వినియోగం పెరిగే కొద్దీ మానవ సంబంధాలు విచ్ఛిన్నమవు తున్నాయని ఇటీవల తేలింది. అశ్చర్యంగా ఉంది కదూ..! బంధుత్వాల మధ్య వాట్సాప్‌ అగాధం స ష్టిస్తోందని తేలింది. అదెలాగంటే... వాట్సాప్‌ వాడుకలోకి రాకముందు ఒకరికొకరు కమ్యూనికేషన్‌లో ఉండేందుకు లెటర్లు రాసుకునే వారు. లేఖల ద్వారా, ఫోన్ల ద్వారా తమ ప్రేమను, అప్యాయతను సజీవంగా ఉంచుకునేవారు. అయితే.. వాట్సాప్‌ ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ మాధుర్యానికి పొందలేకపోతున్నారు. మన వారికి మరింత దగ్గర కావడం పోయి ఇది మరింత గందరగోళానికి, గోడవలకు, వివాదాలకు దారి తీస్తోంది. వాట్సాప్‌ లాంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ లో ప్రధాన ప్రతికూలత ఏమిటంటే..

ఇది మీ సన్నిహితులతో మీరు కచ్చితంగా టచ్‌లో ఉండేలా ఫోర్స్‌ చేస్తుంది. ఒక వేళ అతను లేదా ఆమె ప్రతి 15 నిమిషాలకోసారి మెసేజ్‌ చేయలేదంటే.. అప్పుడు మీరిద్దరూ విడిపోతున్నట్టు ఫీలింగ్‌ మొదలవుతుంది. దీంతో మీరు సరిగా మాట్లాడుకోలేరు. వాట్సాప్‌లో తాజాగా వచ్చిన కొత్త అప్‌డేట్‌ బ్లూ టిక్‌ మార్క్‌. ఇది మన మెసేజ్‌ అవతలి వ్యక్తి చదివారా.. లేదా? అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. కానీ దీని వల్ల కపుల్స్‌ మధ్య గొడవలు పెరిగిపోయాయి. తన మెసేజ్‌ కు వెంటనే జవాబు ఇవ్వలేదనే కారణంతోనే ఈ గొడవలు జరుగుతున్నాయి. అతను నాకు ఎందుకు మెసేజ్‌ పంపడం లేదు? అనే ప్రశ్న ఆడవారి మదిని తొలిచేస్తోంది. దీంతో వారు అంతులేని కోపానికి.. అసహనానికి గురవుతున్నారు. ఇలాంటి వాటి వల్ల.. తమ వాట్సాప్‌ మెసేజ్‌ లను విస్మరించారనే కారణంతో కొందరు తమ భార్యలకు విడాకులు ఇచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. వాట్సాప్‌ లో అవతలి వ్యక్తి లేదా ప్రేమించే వ్యక్తి ఫలాన టైంకి కనిపించి ఆ తర్వాత కూడా మెసేజ్‌ చేయలేదంటే అది మరింత వాదనలకు తీస్తోంది. ఈ సైకిల్‌ అతనితో తరచూ రిపీట్‌ అవుతూ ఉంటోంది. దీని వల్ల ప్రయోజనం ఉన్నా లేకపోయినా.. రిలేషన్షిప్‌ లో ఉన్నా లేకపోయినా.. ఇదే కొనసాగుతోంది. ఒక వేళ అతను తన లాస్ట్‌ సీన్‌ ను దాచేందుకు ప్రయత్నించాడా.. అది అపనమ్మకానికి.. అనుమానానికి దారి తీస్తోంది. రోజంతా మెసేజ్‌ లు చేయడం వల్ల రిలేషన్‌షిప్‌ ఏమాత్రం బలపడదు. ఇది చాలా వరకు చెడు చేస్తుంది. అవతలి వ్యక్తి పనిపై దృష్టి కేంద్రీకరించకలేకపో వడానికి ఇది దారి తీస్తుంది. ఒకానొక దశలో వాట్సాప్‌ మీ రిలేషన్‌షిప్‌ను దూరం చేసేస్తుంది. వాట్సాప్‌లో జరిగే ఎక్కువ కాన్వర్జేషన్స్‌ చివరికి మీ మధ్య అపార్థాలు.. అభిప్రాయ భేదాలు.. గందరగోళం ఏర్పడేందుకు కారణమవుతాయి. ఫేస్‌ టు ఫేస్‌ మాట్లాడ కపోవడం వల్ల మెసేజ్‌ లను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం పొంచి ఉంటుంది.

ఇక స్టేటస్‌ల విషయానికొస్తే ప్రతి యూజర్‌కు అలవాటైన ఫీచర్‌ వాట్సాప్‌ స్టేటస్‌ అప్‌డేట్‌. పెట్టిన 24 గంటల తర్వాత ఇది అటోమేటిక్‌గా డిలెట్‌ అవుతుంది. అయితే పెట్టడం వరకూ ఒకే. దీన్ని ఎంత మంది చూశారో కూడా కాంటాక్ట్‌ నెంబర్లు అప్పీయర్‌ అవుతుంది. ఇలా ఎవరెవరు ఏ స్టేటస్‌ పెట్టారో తెలుసుకునేందుకు అదే పనిగా, వసరుగా స్టేటస్‌లను చూస్తూ ఉండటం కామన్‌గా మారిపోయింది. అయితే స్టేటస్‌ అప్‌డేట్‌ చేసిన తర్వాత చూస్తారనుకున్న వ్యక్తులు ఆ స్టేటస్‌ను చూడకపోతే కొంత నిరాశకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు స్టేటస్‌లలో కూడా ఫ్లార్వర్డ్‌ మెసెజ్‌లు పోస్ట్‌ చేయటం చిరాకు తెప్పించే విషయం. మాములుగానే వాట్సాప్‌ ఉన్న వ్యక్తి గ్రూపుల్లో సభ్యులుగా ఉంటాడు. ఆ గ్రూపుల్లో వచ్చిన మెసెజులే ఫార్వడ్‌ అవుతూ పర్సనల్‌ ఇన్‌బాక్స్‌కు కూడా వస్తుంటాయి. ఇది చాలదన్నట్టు కొందరు వాటిని కూడా స్టేటస్‌లుగా పెడుతుంటారు. దీంతో వ్యూవర్‌ చిరాకుగా భావించి మీ స్టేటస్‌లను మ్యూట్‌ చేయవచ్చు. కాబట్టి ఏవైనా ముఖ్యమైన అంశాలను మాత్రమే స్టేటస్‌లో పోస్టు చేయాలి తప్ప మిత్రులను అసహనానికి గురి చేసి, మీ ఆనందానికి అడ్డుకట్టులు వేసుకోవద్దు.. 
వాస్తవ జీవితంలో ఇద్దరూ సరదాగా.. సంతోషంగా మాట్లాడుకునే అవకాశం కోల్పోతారు. ఎక్కువగా వాట్సాప్‌ లోనే సంభాషించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి వాట్సాప్‌ మీలో ఉన్న అసంతృప్తిని వెల్లడించేస్తుంది. మీరు దేని గురించి వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నారో.. ఆందోళన చెందుతున్నారో మీ భాగస్వామికి తెలియజెప్పడానికి బదులు మీరు ఇచ్చే 'ఓకే' అనే సమాధానం లేదా మీరు వారి ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోవడం వారిని మరింత అప్‌ సెట్‌ చేస్తుంది. మీ పాసివ్‌ ఎగ్రెషన్‌ బిహేవియర్‌ లాంగ్‌ రన్‌లో చివరికి మీ రిలేషన్‌షిప్‌ ను పూర్తిగా దెబ్బ తీస్తుంది. మీరు మీ భాగస్వామితో వాట్సాప్‌ ద్వారా టచ్‌ లో ఉన్నట్లయితే అది మీ బలహీన రిలేషన్‌షిప్‌ను తెలియజేస్తుంది. ఇలాంటి సమయంలో మీ భాగస్వామితో కొద్దిసేపు ఏకాంతంగా గడపడం.. టైమ్‌ స్పెండ్‌ చేయడం కీలకం. ఏదైతే ఇంతకు ముందు మీరు కోల్పోయారో వాటిని పూర్తిగా ఆస్వాదించడం ముఖ్యం. వాట్సాప్‌ దీనినే మీకు దూరం చేస్తుంది.

©2019 APWebNews.com. All Rights Reserved.