గూగుల్ ఫొటోస్‌లోని ఫీచర్లు.!

గూగుల్ ఫొటోస్ యాప్ ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్‌లో డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. అయితే గూగుల్ ఫొటోస్‌కు సంబంధించిన ఫీచర్ల గురించి అందరికీ తెలియకపోవచ్చు. అసలు గూగుల్ ఫొటోస్‌లో ఉన్న ఫీచర్లేంటి? వాటిని ఎలా వాడుకోవాలి?

-స్మార్ట్‌ఫోన్‌లో తీసుకున్న ఫొటోలను షేర్ చేయడానికి, బ్యాకప్ చేసుకోవడానికి ఇందులో ఉండే nifty ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. 
-nifty ఫీచర్ ద్వారా అన్‌లిమిటెడ్ స్టోరేజ్ వాడుకోవచ్చు.
-మీ ఫొటోలను ఒరిజినల్ రిజల్యూషన్‌లో సేవ్ చేయాలనుకుంటే దానికి చెల్లించాల్సి ఉంటుంది. 
-అవసరం లేదనుకుంటే వాటినే కుదించి అదే పరిమాణంలో లేదా 16మెగా పిక్సెల్ కంటే రిజల్యూషన్‌లో సేవ్ చేసుకోవచ్చు. 
-ఇలాంటి క్లౌడ్ బేస్డ్ సర్వీస్‌పై ఆధారపడడం ద్వారా మీ ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, ట్యాబ్‌లలో ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజీ ఖర్చు కాకుండా ఉంటుంది. 
-మీ పాత ఫొటోలను కూడా డిజిటైజ్ చేసి, గూగుల్ ఫొటోస్ యాప్ ఉపయోగించి మీ ఫోన్లో ఉండే గ్యాలరీకి అనుసంధానం చేసుకోవచ్చు. 
-స్టాప్-మోషన్ యానిమేషన్ తయారు చేసుకోవాలంటే యాప్‌లోని అసిస్టెంట్ ట్యాబ్‌లో యానిమేషన్‌ని ఎంచుకుని సుమారు 2 నుంచి 50 ఫోటోలను Gif గా కూడా మార్చుకోవచ్చు. 
-గూగుల్ యాప్‌లోని అసిస్టెంట్ ట్యాబ్‌ను ఓపెన్ చేసి అందులో ఉన్న collage అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే అద్భుతమైన ఫీచర్లతో ఫొటోలను రూపొందించుకోవచ్చు. 
-ఫొటో ఓపెన్ చేసి quick photo edits ఆప్షన్‌ను క్లిక్ చేస్తే కలర్ ఫిల్టర్ టూల్ వస్తుంది. దీని ద్వారా మీ ఫోటోలను ఎలా కావాలో అలా ఎడిట్ చేసుకోవచ్చు.

©2019 APWebNews.com. All Rights Reserved.