ఫోన్ ఎక్కు‌వ‌గా వాడుతున్నా‌రా?

ఫోన్‌ ఎక్కువగా మాట్లాడుతున్నారా ?...ఎక్కువగా చూస్తున్నారా...అయితే జాగ్రత్తలు పాటించాల్సిందే. లేకుంటే ప్రమాదం తప్పదు. ఇప్పుడు ఫోన్‌ నిత్యవసర వస్తువుగా మారింది. అది లేకుండా ఎక్కడికి వెళ్లలేము కూడా.

మనం వాడటమే కాకుండా చిన్నపిల్లల్ని ఆడించాలన్నా, వారి ఏడుపును ఆపాలన్నా మనం టక్కున ఫోన్‌ తీసి వారికి ఇచ్చేస్తుంటాం. వారు దాన్ని నోటిలో పెట్టుకోవడమో, ఆడుకోవం చేస్తారు. ఫోన్‌కి ఉన్న క్రిములు, దుమ్ము అంతా వారికి చేరి, రోగాలు వస్తాయి.
ఫోన్‌ వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే నష్టం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
- ఫోన్‌ ఎక్కువగా ఉపయోగించే వారికి రేడియేషన్‌ ప్రభావం తప్పకుండా ఉంటుంది. 
- వీటి వల్ల శరీరం ముడతలు పడటం, దద్దుర్లు రావడం జరుగుతాయి.
- కళ్ల చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి. మెడకింద, గడ్డం కింద ముడతలు వస్తాయి.
జాగ్రత్తలు:-
- బ్యాటరీ తక్కువగా ఉన్న టైమ్‌లో మాట్లాడకూడదు. అత్యవసరం అయితేనే మాట్లాడండి. 
- ఛార్జింగ్‌ పెట్టిన సమయంలో ఛార్జింగ్‌ తీసి మాట్లాడటం మంచిది.
- అత్యవసరమైతేనే ఫోన్‌లో మాట్లాడాలి. చిన్న విషయాలను మేసేజ్‌ రూపంలోనైనా తెలపవచ్చు.
- ఫోన్‌ మాట్లాడేటప్పుడు ఎడమవైపు పెట్టుకొని మాట్లాడాలి. 
- హెడ్‌ఫోన్స్‌ ఉపయోగిస్తే చాలావరకు మంచిది. లేదా స్పీకర్‌ ఆన్‌చేసి మాట్లాడుకోవచ్చు.
- నిద్రిస్తున్న సమయంలో ఫోన్ని దూరంగా ఉంచుకోవాలి.
-ఫోన్ వేడెక్కేంత‌గా మాట్లా‌డ‌కూడదు. లేకుంటే పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
- చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదు.

©2019 APWebNews.com. All Rights Reserved.