జియో బర్త్ డే ఆఫర్.. అదిరిపోయింది !

 

టెలికాం రంగంలో జియో సంచలనం సృష్టించింది. రిలయన్స్‌ సంస్థ జియో సర్వీసెస్‌ను ప్రారంభించి రెండేళ్లు అవుతున్నసందర్భంగా జియో కస్టమర్లకు రిలయన్స్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

రూ.100కే అపరిమిత కాల్స్‌, డేటా ఇవ్వనుంది. ఈ ఆఫర్‌ను మూడు నెలల పాటు వినియోగించుకోవచ్చు. వినియోగదారులకు ఈ ఆఫర్‌ను అందించేందుకు ప్రముఖ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీ అయిన ఫోన్‌ పేతో జియో ఒప్పందం కుదుర్చుకుంది.

 
 ఇప్పటికే జియో రూ.399కి 84 రోజుల పాటు రోజుకు 1.5జీబీ హైస్పీడ్‌ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌కు రూ.100 డిస్కౌంట్‌ ఇచ్చి రూ.299కే ఉచిత సేవలను కల్పిస్తోంది. తాజాగా ప్రవేశపెట్టిన కొత్త ఆఫర్‌తో వినియోగదారులు ఉచిత అపరిమిత కాల్స్‌, రోజుకు 100 మెసేజ్‌లు పంపుకొనే అవకాశం ఉంది. రూ.100 డిస్కౌంట్‌ ప్లాన్‌లో రెండు ఆప్షన్లు ఉన్నాయి.

* జియో యాప్‌ ద్వారా రీచార్జ్‌‌ చేసుకున్నప్పుడు రూ.50 క్యాష్‌బ్యాక్‌ వౌచర్లు వస్తాయి. ఈ వౌచర్లతో రూ.50 ఇన్‌స్టెంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది.

 

* మై జియో యాప్‌లో ఉన్న ఫోన్‌ పే ఆప్షన్‌ ద్వారా రీచార్జ్ మొత్తం చెల్లిస్తే రూ.50 ఇన్‌స్టెంట్‌ క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 12 నుంచి 21 వరకే లభ్యమవుతుంది.

©2019 APWebNews.com. All Rights Reserved.