మోటో జీ6ప్లస్‌పై రూ.3వేల డిస్కౌంట్‌..!

ప్రముఖ మొబైల్‌ బ్రాండ్‌ మోటోరోలాపై ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ లెనోవో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గతేడాది విడుదల చేసిన మోటో జీ5ప్లస్‌కు విశేష ఆదరణ లభించింది.

ఇప్పుడు దానికి కొనసాగింపుగా మోటో జీ6ప్లస్‌ను లెనోవో భారత విపణిలోకి విడుదల చేసింది. ఎప్పుడో ప్రకటించిన ఈ ఫోన్‌ చాలా ఆలస్యంగా రావడం గమనార్హం. భారత మార్కెట్‌లో దీని ధర రూ.22,499గా నిర్ణయించారు. ఆఫ్‌లైన్‌తో పాటు, ఆన్‌లైన్‌లో అమెజాన్‌.ఇన్‌ ద్వారా సెప్టెంబరు 10 నుంచి ఈ ఫోన్‌ అందుబాటులో ఉండనుంది.

ఈ ఫోన్‌ విడుదల సందర్భంగా లెనోవో ప్రత్యేక రాయితీని ఇస్తోంది. పేటీఎం మాల్‌ ద్వారా రూ.3000 వరకూ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అంతేకాకుండా వడ్డీలేని రుణంపై కూడా ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇక జియో వినియోగదారులు రూ.198, రూ.299 రీఛార్జ్‌లపై రూ.4,450 విలువైన అదనపు ప్రయోజనాలను పొందనున్నారు.

మోటో జీ6ప్లస్‌ ప్రత్యేకతల విషయానికొస్తే.. 
* 5.9 ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే(18:9)
* స్నాప్‌డ్రాగన్‌ 630 ప్రాసెసర్‌
* 2.2 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ 
* 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్
* 12+5మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
* 16మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
* 3,200 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం(టర్బో ఛార్జింగ్‌)
* బ్లూటూత్‌ 5.0, టైప్‌-సి పోర్ట్‌, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌

©2019 APWebNews.com. All Rights Reserved.