ఫేస్‌బుక్‌ లో కొత్త ఫీచర్‌..!

వినియోగదారుల కోసం ఫేస్‌బుక్‌ మరో కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. వీడియోలను చూసేందుకు వీలుగా ఆ కంపెనీ 'వీడియో వాచ్‌ ' పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

సంప్రదాయ టీవీలకు బదులుగా ఆన్‌లైన్‌ వేదికల్లో వీడియోలు చూసే అలవాటు ప్రజల్లో పెరుగుతున్న నేపథ్యంలో వాచ్‌ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది గేమ్‌ షోలు, క్విజ్‌లు వంటి కార్యక్రమాలను కూడా ఇందులో చూడవచ్చు. అండ్రాయిడ్‌, ఐఫోన్‌, ఆపిల్‌ టీవీ, సామ్‌సాంగ్‌ స్మార్ట్‌ టీవీ, అమెజాన్‌ టీవీలో ఈ ఫీచర్‌ పని చేస్తుంది.

©2019 APWebNews.com. All Rights Reserved.