ఉచిత వెబ్‌సైట్ కావాలా?

రోజురోజుకూ మన లైఫ్ డిజిటల్‌గా మారిపోతున్నది. లావాదేవీలు సైతం.. డిజిటల్‌గా రూపాంతరం చెందాయి. పుస్తకాలు కూడా ఎప్పుడో డిజిటల్‌గా మారిపోయాయి. అచ్చేసిన తెలుగు పుస్తకాలు, మ్యాగజైన్‌లు త్వరలో డిజిటల్ రూపంలోకి మారి డబ్బులు సంపాదించనున్నాయి. అదెలా అంటే..

మన దేశంలోని స్థానిక భాషలలోని కంటెంట్‌ని ఈజీగా ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ కంటెంట్‌గా మార్చుకోడానికి గూగుల్ నవలేఖ పేరుతో ఒక టూల్ క్రియేట్ చేసింది. ఈ టూల్ ద్వారా పుస్తకాలు, న్యూస్‌పేపర్, మ్యాగజైన్లు సులభంగా వెబ్‌సైట్ కంటెంట్‌గా మార్చుకోవచ్చన్నమాట. ఇందుకోసం మనం చేయాల్సిందేంటంటే.. ఏ కంటెంట్ అయితే వెబ్‌సైట్‌లోకి మార్చుకోవాలనుకుంటున్నామో దాన్ని స్కాన్ చేసి గూగుల్ నవలేఖ టూల్‌లో అప్‌లోడ్ చేయాలి. అది వెంటనే వెబ్‌సైట్ కంటెంట్‌గా మారిపోతుంది. ఆ కంటెంట్‌తో నవలేఖ టూల్ ఒక వెబ్ పేజీ తయారుచేస్తుంది. వెబ్‌సైట్ మీద ఎలాంటి అవగాహన లేకున్నా సరే.. జస్ట్ స్కాన్ చేసి మన దగ్గర ఉన్న సమాచారాన్ని వెబ్‌సైట్ కంటెంట్‌గా మార్చుకోవచ్చన్నమాట. మూడేండ్లు డొమైన్, వెబ్ హోస్టింగ్ సేవలను ఫ్రీగా అందిస్తుంది గూగుల్. యాడ్‌సెన్స్ ద్వారా మనం వెబ్‌సైట్‌లో పెట్టిన కంటెంట్‌కి యాడ్స్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం హిందీకే పరిమితమైన ఈ టూల్ త్వరలో తెలుగు, తమిళం, మరాఠీ భాషలలో అందుబాటులోకి తేనున్నారు.

©2019 APWebNews.com. All Rights Reserved.