భారత మార్కెట్లోకి ట్యాంబో స్మార్ట్ ఫోన్..!

ప్రముఖ మొబైల్ తయారు సంస్థ ట్యాంబో తాజాగా భారత మొబైల్ మార్కెట్లోకి టీఏ 4 పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. దీని ధర రూ.6,999 గా సంస్థ నిర్ణయించింది. అలాగే ఈ ఫోన్ ఫై జియో రూ.2200 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను అందివ్వడం విశేషం.

 

ట్యాంబో టీఏ 4 ఫీచర్లు చూస్తే..

* 5.45 ఇంచ్ డిస్‌ప్లే
* 640 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
* 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
* 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్
* 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్)
* ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

©2019 APWebNews.com. All Rights Reserved.