14 వేలకే ఐబాల్‌ ల్యాప్‌టాప్‌...!

ఐబాల్‌ సంస్థ తాజాగా మరో నూతన ల్యాప్‌టాప్‌ను ఇండియా మార్కెట్‌లోకి విడుదల చేసింది. కాంప్‌బుక్‌ మెరిట్‌ జీ9 పేరుతో విండోస్‌ 10 ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.13,999 ధరకే ఇది లభిస్తున్నది.

కోబాల్ట్‌ బ్లూ రంగులో 1.1కేజీల లైట్‌వెయిట్‌తో దీన్ని రూపొందించారు. 11.6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, సెల్‌రాన్‌ ఎన్‌3350 ప్రాసెసర్‌, మల్టీ ఫంక్షనల్‌ టచ్‌ ప్యాడ్‌, ఆరు గంటల బ్యాటరీ లైఫ్‌ ప్రధాన ఫీచర్లు ఉన్నాయి. ఫిబ్రవరిలో తక్కువ ధరలో లాంచ్‌ చేసిన ప్రీమియో వి2.0 ధరకంటే కూడా చవకగా ధరలో దీన్ని దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. మంచి ఫీచర్లు, బడ్జెట్‌ ధర, రీజనబుల్‌ మెమొరీతో చూడటానికి ఆకట్టుకునేలా దీన్ని రూపొందించింది.

©2019 APWebNews.com. All Rights Reserved.