బ్యాటరీ సామర్థ్యం పెరుగాలంటే..!

ల్యాప్‌టాప్‌లో ఏదైనా ముఖ్యమైన పనిచేస్తున్నప్పుడు బ్యాటరీ డెడ్ అయిపోతుంటుంది. ఆ సమయంలో చికాకు అంతాఇంతా కాదు. బ్యాటరీ లైఫ్‌ని మరింత పెంచేందుకు కొన్ని మార్గాలు.

-కొన్నిసార్లు యూఎస్‌బీలకు ఇతర డివైస్‌లను అంటే.. పెన్ డ్రైవ్‌లను, స్పీకర్‌లను పెట్టేస్తాం. ఆ తర్వాత తీయడం మరిచిపోతాం. దీనివల్ల   కూడా బ్యాటరీ త్వరగా అయిపోతుంది. కాబట్టి, వాటిని వెంటనే తొలగించండి. 
-సీడీ, డీవీడీ డ్రైవ్‌లను కూడా ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంచుకోవడం మరచిపోవద్దు. 
-స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎక్కువ పెడితే కానీ అక్షరాలు కనిపించవు. ఒకవేళ పనిచేయాలంటే కూడా బ్రైట్‌నెస్ ఎక్కువ ఉండాలనుకుంటారు. కానీ, పని అయిపోగానే ఆ బ్రైట్‌నెస్ కూడా తగ్గించేయండి. 
-స్పీకర్‌లను మ్యూట్‌లో పెట్టుకోవడం, మల్టీమీడియా సాఫ్ట్‌వేర్‌లకు దూరంగా ఉండడం ద్వారా బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. 
-స్క్రీన్‌సేవర్‌లను తీసేయడం, పనులను వీలైనంత త్వరగా ముగించుకోవడం చేయాలి. అప్పుడే బ్యాటరీ చార్జింగ్‌ని నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. 
-అధిక వేడి ల్యాప్‌టాప్ బ్యాటరీ బ్యాకప్‌ని దహించి
వేస్తుంది. అందుకే ల్యాపీని వేడి వాతావరణానికి దూరంగా ఉంచాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం కూడా ఉత్తమం. 
-ల్యాపీలోని సాఫ్ట్‌వేర్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి. ల్యాప్‌టాప్ బ్యాటరీని చార్జ్ చేసే క్రమంలో ఒరిజనల్ అడాప్టర్‌ను మాత్రమే ఉపయోగించడం మంచిది. 

©2019 APWebNews.com. All Rights Reserved.