మార్కెట్లోకి ‘జియోఫోన్‌ 2..!11

టెలికాం రంగం లో పెను సంచలనాలు సృష్టిస్తూ వస్తున్నరిలయన్స్‌ జియో..తాజాగా మరో వార్త ను ప్రకటించి కస్టమర్లను ఆనందపరిచింది. ఇప్పటికే ‘జియోఫోన్‌’ పేరుతో ఫీచర్‌ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెల్సిందే..కేవలం రూ 1500 లకు ఈ ఫోన్ రావడం తో ఈ ఫోన్‌ కు భారీ డిమాండే ఏర్పడింది.

 

ఈ డిమాండ్ చూసిన యాజమాన్యం.. గురువారం సంస్థ 41వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ‘జియోఫోన్‌ 2’ విడుదల చేసి ఆకట్టుకున్నారు. ముఖేశ్‌ కుమార్తె ఈశా అంబానీ ‘జియోఫోన్‌ 2’ ను ఆవిష్కరించారు. ఆగస్టు 15న ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపింది. ఇది కూడా స్మార్ట్‌ ఫీచర్‌ ఫోన్‌ కావడం విశేషం. క్వెర్టీ కీప్యాడ్‌తో ఉండే ఈ ఫోన్‌లో హరిజాంటల్‌ స్క్రీన్‌ వ్యూ కూడా ఉంటుంది. దీని ధర రూ. 2,999గా ఉండనున్నట్లు సమాచారం.

©2019 APWebNews.com. All Rights Reserved.