9 కెమెరాల స్మార్ట్ ఫోన్..

 

మాములుగా స్మార్ట్ ఫోన్లకు ముందు , వెనుక కెమెరాలు ఉంటాయని మాత్రమే తెలుసు..కానీ 9 కెమెరాలు కలిగిన ఫోన్ ను మీరు ఎప్పుడైనా చూసారా..లేదా అయితే అతి త్వరలో అలాంటి ఫోన్ ను చూడబోతున్నారు.

లైట్ అనే కంపెనీ త్వరలో 9 కెమెరాలు కలిగిన ఓ ఫోన్‌ను విడుదల చేయబోతుందట. ఇప్పటికే ఈ ఫోన్ ఫై పలు పరీక్షలు చేసిన సంస్థ త్వరలోనే ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

 

వాస్తవానికి లైట్ కంపెనీ గతంలో ఎల్16 పేరిట ఓ పాకెట్ సైజ్ కెమెరాను విడుదల చేసింది. అందులో ఏకంగా 16 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే సదరు కెమెరా నుంచి ప్రేరణ పొంది లైట్ కంపెనీ తాను కొత్తగా విడుదల చేయనున్న స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 9 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక ఈ ౯ కెమెరాల ప్రత్యేకత విషయానికి వస్తే..

 * 9 కెమెరాలతో తీసుకునే ఫొటోలు 64 మెగాపిక్సల్ క్వాలిటీని కలిగి ఉంటాయట.

* అత్యంత తక్కువ కాంతిలో ఫొటోలు తీసినా చాలా బాగా వచ్చేలా ఆ కెమెరాలను తయారు చేశారట. కాకపోతే ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందో సంస్థ తెలుపలేదు.

©2019 APWebNews.com. All Rights Reserved.