రూ.499 కే జియో డాంగిల్‌..

ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే జియో..తాజాగా జియో డాంగిల్‌ ఫై భారీ ఆఫర్ ను ప్రకటించి మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

పోర్టబుల్ 4జీ రూటర్ ‘జియోఫై’ పై రూ.500 క్యాష్ బ్యాక్ ప్రకటించింది. వాస్తవానికి మొదటగా దీని అసలు ధర రూ.1999 కాగా, గతేడాది సెప్టెంబరులో దీని ధరను రూ.999కి తగ్గించింది. ఇప్పుడీ ధరపై రూ.500 క్యాష్ బ్యాక్ ప్రకటించడంతో రూ.499కే జియో డాంగిల్‌ వస్తున్నమాట.

 

ప్రస్తుతం జియోఫై రూటర్‌ను ఉపయోగిస్తున్నవారు ఈ ఆఫర్‌కు అనర్హులు. కొత్త వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని జియో తెలిపింది. ఈరోజు నుండి ఈ ఆఫర్ అమల్లోకి వచ్చింది. అయితే, ఎప్పటి వరకు ఇది అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని మాత్రం సంస్థ తెలుపలేదు. జియో స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా ‘జియోఫై’ని కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ లో భాగంగా మరో వార్త కూడా జతచేసింది.

©2019 APWebNews.com. All Rights Reserved.