ఎపి వెబ్ న్యూస్.కామ్

సామాజిక మాధ్యమంలో అనాథగా పరిచయమై డబ్చు కోసం మహిళను వేధిస్తున్న వ్యక్తిని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. నాచారం పోలీసు స్టేషన్‌లో ఎస్సై వెంకటరెడ్డితో కలిసి సీఐ విఠల్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.

చిక్కడపల్లిలోని శ్రీవట్టికోట ఆళ్వారు స్వామి నగర కేంద్ర గ్రంథాలయాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా గురువారం సందర్శించారు. ఇటీవల గ్రంథాలయ అభివృద్దికి ప్రభు త్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన నేపథ్యంలో సీసీఎల్ ప్రాంగణాన్ని సందర్శించిన కలెక్టర్ చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, వసతుల తీరును పరిశీలించి ఆధునీకరణకు అవసరమైన సూచనలు చేశారు.

హిమాయత్‌నగర్,ఫిబ్రవరి16 :కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు హిజ్రా,ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకుని సమాజంలో స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని కల్పించాలని తెలంగాణ క్వీర్ కలెక్టివ్ గ్రేటర్ ప్రతినిధులు వై.జయంతి, చంద్రముఖి, వినీత, అంజలి, తాషి తెలిపారు. శుక్రవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రైవేట్,ప్రభుత్వ రంగంలో ట్రాన్స్‌జెండర్స్‌కు ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు కల్పించాలని, రాష్ట్ర స్థాయిలో ట్రాన్స్‌జెండర్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. సమాజంలో తాము భాగమేనని, ఆరోగ్య సమస్యలను చూసేందుకు దవాఖానను ఏర్పాటు చేయాలన్నారు.హిజ్రా,ట్రాన్స్ జెండర్‌ల పట్ల వివక్ష, హింస రూపు మాపాలని కోరుతూ ఈ నెల18న కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపం నుంచి అంబర్‌పేటలోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్ వరకు క్వీర్ స్వాభిమాన కవాతు నిర్వహిస్తామని తెలిపారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హుస్సేన్‌సాగర్ శుద్ధి పనులను వేగవంతం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులను ఆదేశించారు. అత్యాధునిక యంత్రాల వినియోగంతో శుద్ధి ప్రక్రియకు తోడుగా ఎలాంటి రసాయనాలను వినియోగించకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మురుగునీటి శుద్ధి విధానాన్ని చేపట్టాలన్నారు.

మెహిదీపట్నం : ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ అమెజాన్‌కు సంబంధించిన గోడౌన్‌లపై శనివారం తూనికల కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. టోలీచౌకి జానకీనగర్ వద్ద ఉన్న అమెజాన్ సర్వీస్ గోడౌన్‌పై హైదరాబాద్ అసిస్టెంట్ కంట్రోలర్ భాస్కర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు కె.విజయ్ సారధి, అనిల్‌కుమార్, సంజయ్ కృష్ణ, అనూరాధ, శ్రీవల్లీలు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. ప్యాకేజీలపై తేదీల మార్పు, ధరల మార్పు, జీఎస్‌టీ పన్ను ఎగవేత ఇతర అంశాలను పరిశీలించి 16 కేసులను నమోదు చేశారు. ఈ దాడుల్లో అమెజాన్ సంస్థ మోసాలు బయట పడ్డాయని, వీటిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కంట్రోలర్ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.