ఎపి వెబ్ న్యూస్.కామ్
స్టేట్ బ్యూరో ఇంచార్జ్ :- మునిబాబు
హైదరాబాద్ : విమానంలో పక్క సీటులో కూర్చున్న ప్రయాణికుడు తనను లైంగికంగా వేధించాడని 25 ఏళ్ల యూనివర్శిటీ విద్యార్థిని శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బెంగళూరు నగరంలో పీజీ చదువుతున్న 25 ఏళ్ల యువతి భోపాల్ నుంచి ఎస్జీ 1267 నంబరు విమానంలో హైదరాబాద్ కు వచ్చింది. విమానంలో విద్యార్థిని నిద్రపోతుండగా పక్క సీటులో ఉన్న ప్రయాణికుడు తనను తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించాడు. దీంతో నిద్ర లేచిన యువతి లైంగిక వేధింపులపై విమాన సిబ్బందిని అప్రమత్తం చేసింది. అనంతరం శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత యువతి శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై ఐపీసీ 354 బి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.