నా లా.. మీరు కలెక్టర్ కండి

చిక్కడపల్లిలోని శ్రీవట్టికోట ఆళ్వారు స్వామి నగర కేంద్ర గ్రంథాలయాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా గురువారం సందర్శించారు. ఇటీవల గ్రంథాలయ అభివృద్దికి ప్రభు త్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన నేపథ్యంలో సీసీఎల్ ప్రాంగణాన్ని సందర్శించిన కలెక్టర్ చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, వసతుల తీరును పరిశీలించి ఆధునీకరణకు అవసరమైన సూచనలు చేశారు.

జైళ్ళశాఖ నుంచి అవసరమైన ఫర్నీచర్‌ను తెప్పించేందుకు ఆదేశించారు. మూసివున్న గదు లను విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా సద్వినియోగం చేసుకోవాలని సీసీఎల్ ఉద్యోగులకు సూచించారు. ఖాళీప్రదేశాలను ఉప యోగించు కోవా లన్నారు. లేడీస్ సెక్షన్‌లో విద్యార్థినులతో కొద్దిసేపు ముచ్చటించిన కలెక్టర్ రోజుకు ఎన్నిగంటలు చదువుతున్నారని ప్రశ్నించారు. అందుకు విద్యార్థీనీలు 12గంటలకు పైగా చదువుతున్నట్లు విద్యార్థినులు పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ అలా కష్టపడి చదివి నా లాగా మీరు కలెక్టర్ కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కోరే డిమాండ్ ఉన్న పుస్తకాలను వెంటనే తెప్పిం చే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ కే.ప్రసన్నారామ్మూర్తి, పాలకమండలి సభ్యురాలు మమతాగుప్త, గాంధీనగర్ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, ముషీ రాబాద్ ఎమ్మార్వో శైలజ, విద్యా సంక్షేమ మౌలిక వసతుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.సాంబయ్య, సీసీఎల్ లైబ్రేరియన్లు రాధాశాస్త్రి, శశిజాదేవి, సీజీ ఎస్ ఉద్యోగులు వెంకటేశ్వర్‌రెడ్డి, సుధీర్, ఉద్యోగులు వేదకళ, ఆముక్త మాల్యద, టీఆర్‌ఎస్ నేత కే.రామ్మూర్తి పాల్గొన్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.