అమెజాన్ గోడౌన్‌లో తూనికల కొలతల శాఖ దాడులు

మెహిదీపట్నం : ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ అమెజాన్‌కు సంబంధించిన గోడౌన్‌లపై శనివారం తూనికల కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. టోలీచౌకి జానకీనగర్ వద్ద ఉన్న అమెజాన్ సర్వీస్ గోడౌన్‌పై హైదరాబాద్ అసిస్టెంట్ కంట్రోలర్ భాస్కర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు కె.విజయ్ సారధి, అనిల్‌కుమార్, సంజయ్ కృష్ణ, అనూరాధ, శ్రీవల్లీలు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. ప్యాకేజీలపై తేదీల మార్పు, ధరల మార్పు, జీఎస్‌టీ పన్ను ఎగవేత ఇతర అంశాలను పరిశీలించి 16 కేసులను నమోదు చేశారు. ఈ దాడుల్లో అమెజాన్ సంస్థ మోసాలు బయట పడ్డాయని, వీటిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కంట్రోలర్ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.