ఎపి వెబ్ న్యూస్.కామ్
ఆస్తమా బాధితులకు అందించే మూలిక ఔషధం చేప మందు పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు జరగనున్న మందు పంపిణీకి 50వేల మందికి పైగా ఆస్తమా బాధితులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా టోకెన్లు, చేపల పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మందు పంపిణీ కోసం 1.32 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. ఆస్తమా బాధితుల కోసం బత్తిన సోదరులు 175 ఏళ్లుగా చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.