మహిళను వేధించిన వ్యక్తి అరెస్టు ..!

ఎపి వెబ్ న్యూస్.కామ్

సామాజిక మాధ్యమంలో అనాథగా పరిచయమై డబ్చు కోసం మహిళను వేధిస్తున్న వ్యక్తిని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. నాచారం పోలీసు స్టేషన్‌లో ఎస్సై వెంకటరెడ్డితో కలిసి సీఐ విఠల్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.

మేడ్చల్‌ జిల్లా,  కుత్బుల్లాపూర్‌ హెచ్‌ఎంటీ రోడ్డు-చింత శివనగర్‌కు చెందిన చిట్టిమళ్ల అవినాష్‌చారి (28) ప్రవేట్‌ ఉద్యోగి. రెండేళ్ల క్రితం నాచారం స్నేహపురి కాలనీకి చెందిన మహిళ (61)తో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. తాను అనాథనని నమ్మించాడు. తిండి, ఇతర ఖర్చుల కోసం ఆమె నుంచి రూ.60 వేలు వరకు తీసుకున్నాడు. అంతటితో ఆగక ఆమె నుంచి ఎలాగైనా మరింత డబ్చును రాబట్టుకోవాలనే దురాశతో మరో ఫోన్‌ నెంబరుతో మహిళకు ఫోన్‌ చేసి రూ.80 వేలు కావాలని డిమాండ్‌ చేశాడు. ‘డబ్బు ఇవ్వని పక్షంలో అవినాష్‌తో మీకున్న సంబంధం గురించి సామాజిక మాధ్యమంలో ఫొటోలు ఉంచుతాన’ని బెదిరించాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసుల ప్రణాళికతో ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తిని స్నేహపురి కాలనీలోని సెయింట్‌ పాయిస్‌ కళాశాల వద్దకు రమ్మని చెప్పింది. డబ్బుల కోసం ఆతృతతో కళాశాల వద్ద వేచి చూస్తున్న అవినాష్‌ను పోలీసులు పట్టుకుని అరెస్టుచేసి విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

తాజా వార్తలు

©2019 APWebNews.com. All Rights Reserved.