రాశిఫలాలు.. 11, జనవరి2019..!

 

మేషం
స్త్రీలకు అకాలభోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. మీ ఆలోచనలు క్రియారూపంలో పెట్టండి. శ్రీవారు, శ్రీమతి మధ్య అభిప్రాయ భేధాలు సమసిపోతాయి. ఉపాధ్యాయులకు అనుకూలమైనకాలం.
వృషభం
రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు కొనసాగుతాయి. బంధువులను కలుసుకుంటారు. స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస మళ్ళుతుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ఉద్యోగస్తుల పనితీరును అధికారులు ప్రశంసిస్తారు.
మిథునం
కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ఏకాగ్రత, పెద్దల సలహా పాటించడం క్షేమదాయకం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
 
ఫ్లీడర్లకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. నిర్మాణ పనులు, మరమ్మతులలో ఏకాగ్రత వహించండి. ఆదాయ, వ్యయాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
సింహం
గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఒంటెద్దు పోకడ మంచిది కాదని గమనించండి. మీ అతిథి మర్యాదలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు అన్నివిధాలా కలిసివస్తుంది.
కన్య
బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. మార్కెటింగ్ రంగాల్లో వారు, రిప్రజెంటివ్‌లు ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహతరించడం వల్ల కొన్ని పనులు సానుకూలమవుతాయి. స్త్రీలు ఆథ్యాత్మిక సేవా కార్యక్రమల పట్ల ధ్యాస వహిస్తారు. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి.
తుల
స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. రచయితలకు, పత్రికా రంగాల్లోవారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. గిట్టనివారికి హితువు చెప్పి భంగపాటుకు గురవుతారు. ప్రముఖులను కలుసుకుంటారు.
వృశ్చికం
ఋణం ఏ కొంతైనా తీర్చటానికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు పెరుగుతుంది. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలెత్తుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు.
ధనస్సు
బంధుమిత్రుల కలయిక వల్ల గృహంలో సందడి కానవస్తుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ప్రతి విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు అధికమవుతాయి.
మకరం
విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. దంపతుల మధ్య అవగాహన కుదురుతుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. స్త్రీలకు ఇరుగుపొరుగు వారి నుంచి సఖ్యత అంతగా ఉండదు.
కుంభం
గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సన్నిహితుల వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది. ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి వస్తుంది. కళ, సాంస్కృతిక రంగాల వారు లక్ష్య సాధనకు కృషి చేయాలి. మీ కార్యక్రమాలలో స్వల్ప మార్పులుంటాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.
మీనం
బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డుంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ కళత్ర ఆరోగ్యం మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు.
©2019 APWebNews.com. All Rights Reserved.