రాశిఫలాలు.. 4, జనవరి2019..!

మేషం
ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఖర్చులు మితంగా ఉంటాయి. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో రాణిస్తారు. మిమ్మల్ని వ్యతిరేకించినవారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు.
వృషభం
ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ఖర్చులు అధికం కావటంతో రుణాలు, చేబదుళ్లు తప్పవు. మీ మాటలు ఇతరులకు చేరవేసే వ్యక్తులున్నారని గమనించండి. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
మిథునం
కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. శ్రమాధిక్యతతో అనుకున్నది సాధిస్తారు. తలపెట్టిన పనిలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి.
కర్కాటకం
విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపంవల్ల కాంట్రాక్టర్లు, బిల్డర్లకు చికాకులు తప్పవు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు.
సింహం
సన్నిహితులతో కలిసి సభలు, సమావేశాలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మిత్రులను కలుసుకుంటారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. వాహన ఛోదకులకు స్వల్ప ఆటంకాలు తప్పవు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి చికాకులు తప్పవు. మీ మాటకు ఇంటా, బయటా గౌరవం లభిస్తుంది.
కన్య
ఉద్యోగస్తులు తొందరపడి సంభాషించటంవల్ల ఇబ్బందులు ఎదుర్కోనక తప్పదు. టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానిక రంగాల వారికి అనుకూలం. భార్యా, భర్తల మధ్య విబేధాలు తలెత్తవచ్చు. ఆపత్సమయంలో ఆత్మీయులకు అండగా నిలుస్తారు. దూర ప్రయాణాలు చర్చల్లో అంచనాలు ఫలించకపోవచ్చు. బంధువుల రాకతో అనుకోని కొన్ని ఖర్చులు మీద పడతాయి.
తుల
నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు అధికారుల వేధింపులు అధికమవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు కలిసిరాగలదు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి.
వృశ్చికం
స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. ఖర్చులు అంతగా లేకున్నా ధన వ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. సోదరీ, సోదరుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. స్త్రీలు బంధువులను కలుసుకుంటారు. మీ సంతానంతో దైవ, సేవా, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనస్సు
ఆదాయం బాగున్నా ఏదో తెలియని అసంతృప్తి, అసహనానికి లోనవుతారు. తెలిసి తెలియక చేసిన పనులు ఇబ్బందులు పెడతాయి. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. ఉపాధ్యాయులకు అధిక శ్రమ, ఒత్తిడి తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. ప్రేమికులకు కొత్త కొత్ ఆలోచనలు స్ఫురిస్తాయి.
మకరం
ఆర్థిక వ్యవహారాలు, నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు అధికమవుతాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి కాగలవు. మీ యత్నాలకు ప్రముఖుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.
కుంభం
విదేశీయానం కోసం చేసే యత్నాలకు అడ్డంకులు తొలగిపోగలవు. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు మధ్యవర్తులపట్ల అప్రమత్తత అవసరం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపంవల్ల పై అధికారులతో మాటపడవలసి వస్తుంది. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడటం మంచిది.
మీనం
విద్యార్థులు ఇతరుల కారణంగా మాటపడవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కలవర పెడతాయి. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. సహోద్యోగులతో అనుబంధాలు బలపడతాయి. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన అమలులో పెడతారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
©2019 APWebNews.com. All Rights Reserved.