రాశిఫలాలు.. 2, జనవరి2019..!

మేషం
పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారిలో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. భాగస్వామిక, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మీ రాక బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. నూతన పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలు అనుకూలిస్తాయి.
వృషభం
స్త్రీలు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఆత్మస్థైర్యం, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేరు. ఎల్ఐసీ, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణం తప్పదు.
మిథునం
విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి. ఒక యత్నం ఫలించటంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. గృహానికి కావాలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తి వ్యవహారాలు, ముఖ్యమైన విషయాలు కొత్త మలుపు తిరుగుతాయి. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ముఖ్యులతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటకం
ఆర్థికంగా స్థిరపడతారు. సోదరులు మీతో అన్ని విషయాల్లోనూ ఏకీ భవిస్తారు. ఆపత్సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. వృత్తి, వ్యాపారాల వారికి ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబంలో అదనపు బరువు బాధ్యతలు అధికం అవుతాయి. పెద్దల ఆరోగ్యంపట్ల శ్రద్ధ అవసరం. ధనం నిల్వ చేయాలనే మీ సంకల్పం నెరవేరదు.
సింహం
బంధువుల ద్వారా అత్యంత కీలకమైన సమాచారం అందిస్తారు. ప్రేమికులకు పెద్దల నుంచి సమస్యలు తప్పవు. సభ, సమావేశాలలో పాల్గొంటారు. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. కొబ్బరి, పండ్లు, కూరగాయలు, పూల వ్యాపారస్తులకు లాభదాయకం.
కన్య
ప్రైవేటు సంస్థల వారికి మార్పు కానరాగలదు. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగానీ ఫలితం దక్కదు. వాహన కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలించగలవు. భాగస్వాముల మధ్య ప్రయోజనకరమైన విషయాలు చర్చకు వస్తాయి. నూతన వ్యక్తుల కలయికవల్ల మీలో ఉత్సాహం కలసివస్తుంది.
తుల
స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. సోదరీ, సోదరుల మధ్య సంబంధాలు బలపడతాయి. కుటుంబ వ్యవహారాలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. మీ సంతానం మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడపుతారు. కష్ట సమయంలో సన్నిహితులు అండగా నిలబడతాయి. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో సఫలీకృతులవుతారు.
వృశ్చికం
ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారు అచ్చుతప్పులు పడుటవల్ల మాటపడక తప్పదు. గృహోపకరణాలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి కాగలవు. స్నేహితులతో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆకస్మికంగా ఆలయాలను సందర్శిస్తారు.
ధనస్సు
బ్యాంకింగ్ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. ప్రేమికులకు పెద్దల నుంచి ప్రోత్సాహం, సన్నిహితుల సహకారం ఉంటాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహారంలో పునరాలోచన అవసరం. బంధువుల రాకతో ఖర్చులు మీ అంచనాలను మించుతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మకరం
ఉపాధ్యాయులకు విద్యార్థులవల్ల ఒత్తిడి, చికాకులు ఎదురవుతాయి. స్త్రీలకు షాపింగ్ విషయాల్లోనూ, వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. దైవ దర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. తలపెట్టిన పనులకు ఆటంకాలు తొలగిపోతాయి.
కుంభం
మీ ఆత్మీయుల కోసం, సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగానీ ఫలితం దక్కుతుంది. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆకస్మిక ధోరణి కుటుంబీకులకు చికాకు కలిగిస్తుంది. ఖర్చులు, రాబడుల విషయంలో ఏకాగ్రత అవసరం. వ్యాపారాలలో పోటీ నిరుత్సాహపరుస్తుంది.
మీనం
పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. విదేశీయత్నాలు వాయిదా పడతాయి. కోర్టు వ్యవహారాలు ఆశించినంత చురుకుగా సాగవు. స్త్రీలకు నూతన వస్తు, వస్త్రప్రాప్తి. స్థానచలనానికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం, శ్రమాధిక్యత తప్పవు. నిరుద్యోగులు శుభవార్తలను అందుకుంటారు.
©2019 APWebNews.com. All Rights Reserved.