రాశిఫలాలు 12, అక్టోబర్ 2018..!

మేషం: ప్లీడర్లకు తమ క్లయింట్‌ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. మీ మంచి కోరుకునేవారి కంటే మీ చెడును కోరుకునే వారు ఎక్కువగా ఉన్నారు.
 
వృషభం: ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సభలు, సమావేశాలలో హూందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారు అచ్చుతప్పులు పడుటవలన మాటపడవలసి వస్తుంది. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
 
మిధునం: ఆర్థికలావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఏ పనియందు ధ్యాస ఉండదు. మీ సంతానం ఆరోగ్య, ఆహార వ్యవహారాలలో మెళకువ అవసరం. ప్రముఖుల కలయిక ఉపకరిస్తుంది.
 
కర్కాటకం: వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. కల్యాణ మండపాల కోసం అన్వేషిస్తారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. సన్నిహితుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
సింహం: రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్ధేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల విషయంలో మెళకువ వహించండి. పూర్వ పరిచయ వ్యక్తుల కలయిక సంతృప్తినిస్తుంది. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు.
 
కన్య: కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత అవసరం. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ కోరిక నెరవేరక పోవడంతో ఆందోళన చెందుతారు. ప్రైవేటు సంస్థల్లో వారు ఓర్పు, అంకిత భావంతో పని చేయవలసి ఉంటుంది. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ యత్నాలకు మంచి సలహా, సహకారం లభిస్తుంది.
 
తుల: ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మార్కెట్ రంగాల వారు ఒత్తిడి, శ్రమాధిక్యతలను ఎదుర్కుంటారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు, రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. బంధుమిత్రులతో ఏకీభవించలేకపోతారు.
 
వృశ్చికం: రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఆశలు చిగురిస్తాయి. గృహం ఏర్పరచుకోవాలనే కోరిక నెరవేరుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు తప్పవు. ప్రముఖులను కలుసుకుంటారు. తలపెట్టిన పనులు వాయిదా వేస్తారు. బంధువులలో మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు.
 
ధనస్సు: కాంట్రాక్టర్లకు ఎప్పటి నుండో ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. మీ ఆంతరంగిక సమస్యలకు పరిష్కార మార్గం కానవస్తుంది. మీ విరోధులు కూడా మీ సహాయం అర్ధిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. స్థిరచరాస్తుల విషయం గురించి చర్చిస్తారు. మీ సంతానం చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
 
మకరం: భాగస్వామ్య రంగాలలో వారికి చికాకులు తలెత్తుతాయి. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కీర్తి ప్రతిష్టలకు కించిత్ భంగం వాటిల్లే సూచనలున్నాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి మిశ్రమం ఫలితం. స్త్రీలు తెలివి తక్కువగా వ్యవహరించడం వలన చేపట్టిన పని కొంత ముందు వెనుకలుగానైనా జయం చేకూరగలదు.
 
కుంభం: బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. దూరప్రయాణాలు, తీర్థయాత్రలు ఉల్లాసంగా సాగుతాయి.
 
మీనం: పోస్టల్, ఎల్.ఐ.సి., ఏజెంట్లకు ఆర్థికంగా బాగుంటుంది. కళ, సాంస్కృతిక, క్రీడా రంగాలవారికి గుర్తింపు లభిస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుతాయి. ఉద్యోగస్తులకు పనిబారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికంగా ఉంటాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
©2019 APWebNews.com. All Rights Reserved.